ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట! | Billionaire Warren Buffett wife overheard complaining about Rs 300 coffee | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట!

Published Mon, Jul 17 2023 6:37 AM | Last Updated on Mon, Jul 17 2023 6:37 AM

Billionaire Warren Buffett wife overheard complaining about Rs 300 coffee - Sakshi

ఇడహొ: ప్రపంచ కుబేరుల్లో వారెన్‌ బఫెట్‌ ఒకరు. ఆయన ఆస్తి 115 బిలియన్‌ డాలర్లకు పైమాటే. అటువంటి వ్యక్తి భార్య కాఫీ ధర ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికర అంశంగా మారింది. సన్‌ వ్యాలీలో ఇటీవల బిలియనీర్ల సమ్మర్‌ క్యాంప్‌ జరిగింది.

ఓ రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో వారెన్‌ బఫెట్‌ భార్య ఆస్ట్రిడ్‌ బఫెట్‌ కప్పు కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడంపై అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారట. ఇతర ప్రాంతాల్లోని కాఫీ ధరతో పోలిస్తే ఇది ఎక్కువేనంటూ అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, సంపద ఎంతున్నా వారెన్‌ బఫెట్‌ మహా పొదుపరి. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement