
మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారిణి
విజయనగరం రూరల్ : భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో గొప్పదని జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి అన్నారు. ఓం మందిరంలో భగవాన్ శ్రీసత్యసాయి ఆరాధన సందర్భంగా వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. శిక్షణ తరగతుల సమన్వయకర్త, ఉపాధ్యాయుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 15 రోజుల పాటు జరిగే తరగతుల్లో వేదం, యోగా, ఆధ్యాత్మిక భజన, జ్యోతి ధ్యానం, ఆరోగ్యం పరిశుభ్రత, భగవద్గీత, మానవత విలువలు, భారతం కథలు, కలియుగ వైకుంఠం, పంచయజ్ఞాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస్ కో–ఆర్డినేటర్ బి.రమేష్‌కుమార్, కన్వీనర్ సన్యాసినాయుడు, 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.