balavikasa
-
భారతీయ సంస్కృతి గొప్పది
విజయనగరం రూరల్ : భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో గొప్పదని జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి అన్నారు. ఓం మందిరంలో భగవాన్ శ్రీసత్యసాయి ఆరాధన సందర్భంగా వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. శిక్షణ తరగతుల సమన్వయకర్త, ఉపాధ్యాయుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 15 రోజుల పాటు జరిగే తరగతుల్లో వేదం, యోగా, ఆధ్యాత్మిక భజన, జ్యోతి ధ్యానం, ఆరోగ్యం పరిశుభ్రత, భగవద్గీత, మానవత విలువలు, భారతం కథలు, కలియుగ వైకుంఠం, పంచయజ్ఞాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస్ కో–ఆర్డినేటర్ బి.రమేష్‌కుమార్, కన్వీనర్ సన్యాసినాయుడు, 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో యువత పాత్ర కీలకం
కాజీపేట రూరల్ : ప్రపంచ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని వరంగల్ పీఠాధిపతి ఉడుముల బాల అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాస శిక్షణ కేంద్రంలో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ కథోళిక వ్యవసాయం, గ్రామీణ ఉద్యమం (ప్రెంచ్ భాషలో మీజార్క్) సదఽస్సులను ఉడుముల బాల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకు ముందు ఉడుముల బాల మీజార్క్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉడుముల బాల మాట్లాడుతూ మీజార్క్ అంతర్జాతీయ సదస్సులు ఓరుగల్లు నగరంలో నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని మహాత్మాగాంధీ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. మీజార్క్ వరల్డ్ ప్రెసిడెంట్ కుమ్మరి కృష్ణాకర్ మాట్లాడుతూ 1954లో ప్రారంభమైన మీజార్క్లో 4 ఖండాల్లోని వివిధ దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. 18 వరకు జరిగే ఈ సదస్సులో ప్రపంచ దేశాల్లోని వాతావరణ మార్పులు, ఆకలిలేని ప్రపంచం, శాంతి, న్యాయం, పేదరిక నిర్మూలన, ఉపాధికి తగిన వేతనం, మంచి ఆరోగ్యం, విలువలతో కూడిన విద్య, స్వచ్ఛమైన తాగునీరు అనే అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. భీమారం మీజార్క్ యువత సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మీజార్క్ వరల్డ్ చాప్లిన్ ఫాదర్ ఒబినో, వరంగల్ నెహ్రూ యువకేంద్ర కో ఆర్డినేటర్ మనోరంజన్, మీజార్క్ ప్రధాన కార్యదర్శి క్లేయర్, యూత్ డెలిగేట్ కేరళ కరోల్స్, మీజార్క్ ఆసియా ఖండం చాప్లిన్ ఫాదర్ మాథ్యూ, తెలుగు మీజార్క్ ప్రతినిధి దుంపాల బాలస్వామి, భారతమిత్ర డైరెక్టర్ ఫాదర్ ఐజక్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వితంతువులపై వివక్షను రూపుమాపాలి
బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి కాజీపేట రూరల్ : వితంతువులపై వివక్షను రూపుమాపాలని బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి పిలుపునిచ్చారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాస శిక్షణ సంస్థలో ఆదివారం వితంతు వివక్ష ఉద్యమంలో మత సంస్థల పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శౌరిరెడ్డి మాట్లాడుతూ వితంతువులపై వివక్షను రూపుమాపడానికి బాల వికాస కృషిచేస్తోందని తెలిపారు. తెలంగా నఅర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన హన్మకొండలోని వేయి స్తంభాలగుడిలో వితంతువులచే గౌరమ్మపూజ చేయించి బతుకమ్మ ఆటలాడిస్తానని ఆయన అన్నారు. బ్రహ్మశ్రీ తాండ్ర నాగేంద్రశర్మ మాట్లాడుతూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని మానవాళి అభివృద్ధి కాంక్షిస్తూ మనం రాసుకున్నవేనని, కాలమాన మార్పు ప్రకారంగా ఆచారాలు కూడా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ వితంతువులపై వివక్ష పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వరంగల్ డయాసిస్ ఫాదర్ జోసఫ్ మాట్లాడుతూ ఈ ఆచారాన్ని రూపు మాపేందుకు బాలవికాసకు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మత గురువు మోహినుద్దీ¯ŒS మాట్లాడుతూ ముస్లిం మతంలో ప్రవక్త ఒక వితంతువును వివాహాన్ని చేసుకుని ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. బాలవికాస సంస్థ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా మాట్లాడుతూ వితంతువులపై వివక్షను రూపుమాపేందుకు 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.డాక్టర్ విశ్వనాథరావు, రిటైర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణమూర్తి, డాక్టర్ కోదండ రామారావు, రమణగుప్తా, అష్టకాల నర్సమ్మ శర్మ, వేదాంతం జగన్నాథాచారి, ధూళిపాల శ్రీనివాస్, పవ¯ŒS శర్మ, ఫాదర్ జారోమ్, వల్లంపట్ల నాగేశ్వర్రావు, ప్రతినిధులు మంజుల, లత, ఉపేంద్ర బాబు, శివ, రాధిక, రమ, వితంతువులు పాల్గొన్నారు. -
వితంతువులపై వివక్ష నిర్మూలనకు కృషి
బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి సంఘీభావం తెలిపిన బ్రాహ్మణ, అర్చక సంఘాలు కాజీపేట రూరల్ : సమాజంలో వితంతువులపై వివక్ష నిర్మూలనకు బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ కృషిచేస్తోందని బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవి కాస పీడీటీసీలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం, అర్చక సం ఘం అధ్యక్షుల సమక్షంలో మంగళవారం యువ వితంతువుల సమావేశం జరిగింది. 25 ఏళ్లలోపు వితంతువులు సుమారు 200 మంది పాల్గొన్నారు. రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర బ్రాహ్మ ణ సంఘ సమాఖ్య అధ్యక్షుడు వేములపల్లి జగన్మోహన్శర్మ, గ్రేటర్ వరంగల్ బ్రాహ్మణ సమితి అధ్యక్షుడు పవన్‌శర్మ, సంఘ సభ్యులు పురుషోత్తం, కిరణ్‌కుమా ర్, హన్మంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శౌరిరె డ్డి మాట్లాడుతూ వితంతువులను మానవతా దృక్పథంతో చూడాలన్నారు. వితంతువులపై వివక్ష రూపుమాపేందుకు తమ సంస్థ 12 ఏళ్లుగా కృషిచేస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ మూఢాచారాన్ని అరికట్టేందుకు పురోహితులు కృషిచేయాలని కోరారు. రాష్ట్ర అర్చక సంఘం అ««దl్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ పూర్వం పండితులు, పురోహితులు, నాయకులు ఉనికి కోసం కొన్ని స్వార్థ మూఢాచారాలు అమలు చేశారని తెలిపారు. వాటితో మహిళలను క్షోభకు గురిచేసేవారని అన్నారు. వితంతువులు బొట్టు, పూలు, గాజులు పెట్టుకోవచ్చని, తీసివేయాలని ఏ శాస్త్రంలోనూ లేదన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘ సమా ఖ్య అధ్యక్షుడు జగన్మోహన్శర్మ మాట్లాడుతూ యువ వితంతువులు పునర్వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస వితుం తు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల ఉపేంద్రబాబు, రాధిక, శివరాం, పుష్ప పాల్గొన్నారు. -
జల సంరక్షకులకు అవార్డులు
బాలవికాస ఆధ్వర్యంలో ప్రదానం కాజీపేట రూరల్ : అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచి, రైతులకు అండగా నిలిచేందుకు బాలవికాస సాంఘిక సేవా సంస్థ కృషి చేస్తోందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతీమానగర్ బాలవికాస పీపుల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం జల వికాసం పేరుతో పూడికతీతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షులకు అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా చెరువులలో పూడిక తీస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని 13 జిల్లాలతో పాటు కర్ణాటకలో రెండు జిల్లాల్లో మెుత్తం 750 చెరువులలో సుమారు 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తీశామని, 1.15 కోట్ల ఎకరాల్లో భూసారం పెంచామని వివరించారు. ఈ ఏడాది 25 గ్రామాల్లో పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జలవికాస అవార్డులు.. ఉత్తమ పూడికతీత గ్రామాలకు (జలసంరక్షులు) అవార్డులు అందజేశారు. కర్ణాటకలోని చిక్బుల్లాపూర్ జిల్లా గుంటిగానపల్లి గ్రామస్తులకు ప్రథమ బహుమతి, వరంగల్ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లుకు రెండవ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆపీసర్ తిరుపతి, కో ఆర్డినేటర్లు ప్రసూన్‌రెడ్డి, శ్రీరాం, రాజ్‌కుమార్, కిరణ్, రాజేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
జల సంరక్షకులకు అవార్డులు
బాలవికాస ఆధ్వర్యంలో ప్రదానం కాజీపేట రూరల్ : అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచి, రైతులకు అండగా నిలిచేందుకు బాలవికాస సాంఘిక సేవా సంస్థ కృషి చేస్తోందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతీమానగర్ బాలవికాస పీపుల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం జల వికాసం పేరుతో పూడికతీతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షులకు అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా చెరువులలో పూడిక తీస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని 13 జిల్లాలతో పాటు కర్ణాటకలో రెండు జిల్లాల్లో మెుత్తం 750 చెరువులలో సుమారు 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తీశామని, 1.15 కోట్ల ఎకరాల్లో భూసారం పెంచామని వివరించారు. ఈ ఏడాది 25 గ్రామాల్లో పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జలవికాస అవార్డులు.. ఉత్తమ పూడికతీత గ్రామాలకు (జలసంరక్షులు) అవార్డులు అందజేశారు. కర్ణాటకలోని చిక్బుల్లాపూర్ జిల్లా గుంటిగానపల్లి గ్రామస్తులకు ప్రథమ బహుమతి, వరంగల్ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లుకు రెండవ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆపీసర్ తిరుపతి, కో ఆర్డినేటర్లు ప్రసూన్‌రెడ్డి, శ్రీరాం, రాజ్‌కుమార్, కిరణ్, రాజేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.