- బాలవికాస ఎగ్జిక్యూటివ్
- డైరెక్టర్ శౌరిరెడ్డి
- సంఘీభావం తెలిపిన
- బ్రాహ్మణ, అర్చక సంఘాలు
వితంతువులపై వివక్ష నిర్మూలనకు కృషి
Published Wed, Aug 17 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
కాజీపేట రూరల్ : సమాజంలో వితంతువులపై వివక్ష నిర్మూలనకు బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ కృషిచేస్తోందని బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవి కాస పీడీటీసీలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం, అర్చక సం ఘం అధ్యక్షుల సమక్షంలో మంగళవారం యువ వితంతువుల సమావేశం జరిగింది. 25 ఏళ్లలోపు వితంతువులు సుమారు 200 మంది పాల్గొన్నారు. రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర బ్రాహ్మ ణ సంఘ సమాఖ్య అధ్యక్షుడు వేములపల్లి జగన్‌మోహన్‌శర్మ, గ్రేటర్ వరంగల్ బ్రాహ్మణ సమితి అధ్యక్షుడు పవన్‌శర్మ, సంఘ సభ్యులు పురుషోత్తం, కిరణ్‌కుమా ర్, హన్మంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శౌరిరె డ్డి మాట్లాడుతూ వితంతువులను మానవతా దృక్పథంతో చూడాలన్నారు. వితంతువులపై వివక్ష రూపుమాపేందుకు తమ సంస్థ 12 ఏళ్లుగా కృషిచేస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ మూఢాచారాన్ని అరికట్టేందుకు పురోహితులు కృషిచేయాలని కోరారు. రాష్ట్ర అర్చక సంఘం అ««దl్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ పూర్వం పండితులు, పురోహితులు, నాయకులు ఉనికి కోసం కొన్ని స్వార్థ మూఢాచారాలు అమలు చేశారని తెలిపారు. వాటితో మహిళలను క్షోభకు గురిచేసేవారని అన్నారు. వితంతువులు బొట్టు, పూలు, గాజులు పెట్టుకోవచ్చని, తీసివేయాలని ఏ శాస్త్రంలోనూ లేదన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘ సమా ఖ్య అధ్యక్షుడు జగన్‌మోహన్‌శర్మ మాట్లాడుతూ యువ వితంతువులు పునర్వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస వితుం తు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల ఉపేంద్రబాబు, రాధిక, శివరాం, పుష్ప పాల్గొన్నారు.
Advertisement
Advertisement