కావలసినవి: వేయించిన శనగపప్పు – కప్పు, నిమ్మకాయలు – రెండు, పంచదార పొడి – రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు – ఏడు, పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి), జీలకర్ర పొడి – అరటీస్పూను, బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను, సాధారణ సాల్ట్ – పావు టీస్పూను, ఐస్‌క్యూబ్స్ – పావు కప్పు.
తయారీ: ∙శనగపప్పుని మిక్సీజార్‌లో వేసి మెత్తగా పొడిచేయాలి. ఈ పొడిని జల్లెడపట్టుకుని ఒకగిన్నెలోకి తీసుకోవాలి. ∙శనగపిండిలో కొద్దిగా నీళ్లుపోసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత కప్పు నీళ్లుపోసి మరోసారి కలుపుకోవాలి ∙ఇప్పుడు దీనిలో బ్లాక్‌సాల్ట్, సాధారణ సాల్ట్, పంచదార పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, పుదీనా ఆకులను సన్నగా తరిగి వేసి చక్కగా కలపాలి ∙చివరిగా ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్‌చేసుకుంటే సత్తు షర్బత్ ఎంతో రుచిగా ఉంటుంది.
- ఈ షర్బత్‌లోని ఉప్పు, ఐరన్, పీచుపదార్థం జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేసి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధ్దకం వంటి సమస్యలను దరిచేరనివ్వవు.
- దీనిని పరగడుపున తీసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది∙
- శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపి మంచి డీటాక్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
- వేసవిలో రోజుకొక గ్లాస్ తాగితే.. దాహం తీరడంతోపాటు, శరీరానికి వేడిచేయకుండా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment