జలుబుతో బాధపడుతున్నారా? | Higher dose of Vitamin C may cut duration of cold | Sakshi
Sakshi News home page

జలుబుతో బాధపడుతున్నారా?

Published Fri, Mar 31 2017 12:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

జలుబుతో బాధపడుతున్నారా?

జలుబుతో బాధపడుతున్నారా?

లండన్‌: జలుబుతో బాధపడుతున్నారా, ఏ మందులు వాడిన త్వరగా తగ్గడం లేదా..అయితే మీ జలుబును త్వరగా తగ్గించుకోవాడానికి పరిశోధకులు ఓ మార్గం కనుగొన్నారు . విటమిన్‌-సీ ఉండే పదార్థాలను ఎక్కువగా తింటే జలుబు త్వరగా నయమవుతుందని పరిశోధనలో వెల్లడైంది. రోజుకు 6-8 గ్రాముల డోస్‌లో విటమిన్‌ సీ ఉండే పదార్ధాలు తింటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఫిన్‌లాండ్‌ హెస్లినిక్‌ యూనివర్సీటి పరిశోధకులు తెలిపారు.
 
ఈ పరిశోధన వివరాలను న్యూట్రిన్‌ జర్నల్‌ ప్రచురించింది. జలుబుతో బాధపడేవారిని రెండు గ్రూప్‌లుగా విభజించి పరీక్షించారు. విటమిన్‌ సీ పుష్కలంగా ఉండే కివీ ప్రూట్స్‌, బెర్రీస్‌, సిట్రస్‌, టమాటో, పీస్‌, బోప్పాయి, డార్క్‌ లీఫీ గ్రీన్స్‌లను అందజేశారు. ఒక గ్రూప్‌కు 6 గ్రాముల డోస్‌, మరో గ్రూప్‌కు 8 గ్రాముల డోస్‌ విటమిన్‌ సీ అందించారు. 6 గ్రామ్‌ల అందించిన వారిలో జలుబు కాలవ్యవధి 17 శాతం, 8 గ్రాములు తీసుకున్నవారిలో 19 శాతం తగ్గిందని పరిశోధనలో వెల్లడయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement