University of Helsinki
-
జలుబుతో బాధపడుతున్నారా?
లండన్: జలుబుతో బాధపడుతున్నారా, ఏ మందులు వాడిన త్వరగా తగ్గడం లేదా..అయితే మీ జలుబును త్వరగా తగ్గించుకోవాడానికి పరిశోధకులు ఓ మార్గం కనుగొన్నారు . విటమిన్-సీ ఉండే పదార్థాలను ఎక్కువగా తింటే జలుబు త్వరగా నయమవుతుందని పరిశోధనలో వెల్లడైంది. రోజుకు 6-8 గ్రాముల డోస్‌లో విటమిన్ సీ ఉండే పదార్ధాలు తింటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని ఫిన్లాండ్ హెస్లినిక్ యూనివర్సీటి పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన వివరాలను న్యూట్రిన్ జర్నల్ ప్రచురించింది. జలుబుతో బాధపడేవారిని రెండు గ్రూప్‌లుగా విభజించి పరీక్షించారు. విటమిన్ సీ పుష్కలంగా ఉండే కివీ ప్రూట్స్, బెర్రీస్, సిట్రస్, టమాటో, పీస్, బోప్పాయి, డార్క్ లీఫీ గ్రీన్స్లను అందజేశారు. ఒక గ్రూప్‌కు 6 గ్రాముల డోస్, మరో గ్రూప్‌కు 8 గ్రాముల డోస్ విటమిన్ సీ అందించారు. 6 గ్రామ్‌ల అందించిన వారిలో జలుబు కాలవ్యవధి 17 శాతం, 8 గ్రాములు తీసుకున్నవారిలో 19 శాతం తగ్గిందని పరిశోధనలో వెల్లడయింది. -
తెలివితేటలు పెరగాలంటే మాత్రం..!
మాతృభాషపై ఎంత ప్రేమ ఉన్నా సరేగానీ, విదేశీ భాషలను నేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశీ భాషలు నేర్చుకున్న వారిలో తెలివి తేటలు మెరుగవుతాయని, నేర్చుకునే భాషల సంఖ్య పెరిగేకొద్దీ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ప్రాక్టికల్ గా తేలింది. యూరీ స్టైరోవ్ నేతృత్వంలోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీకి చెందిన రీసెర్చర్స్ బృందం విదేశీ భాషలపై బాగా అవగాహన ఉన్న 22 మంది(10 మంది బాలురు, 12 మంది బాలికలు) విద్యార్థులను ప్రశ్నించి, పరిశీలించి కొన్ని విషయాలను గుర్తించారు. వారి మాతృభాష పదాలు, విదేశీ భాషల పదాలను ప్లే చేసి ఎక్కువ భాషలు తెలిసిన విద్యార్థుల మెదడు పనితీరు చాలా వేగంగా ఉందని వెల్లడించారు. అధిక భాషలపై అవగాహన ఉన్న విద్యార్థులలో చురుకుదనం ఎక్కువగా ఉండి ఎక్కువ విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం ఉంటుందని ఎలక్ట్రాన్ సెఫలోగ్రఫీ(ఈఈజీ) ద్వారా హెల్సింకీ వర్సిటీ బృందం ప్రాక్టియల్ గా వివరించింది.