తెలివితేటలు పెరగాలంటే మాత్రం..! | Learning foreign languages will helpful to more talent | Sakshi
Sakshi News home page

తెలివితేటలు పెరగాలంటే మాత్రం..!

Published Sat, Sep 3 2016 2:19 PM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM

తెలివితేటలు పెరగాలంటే మాత్రం..! - Sakshi

తెలివితేటలు పెరగాలంటే మాత్రం..!

మాతృభాషపై ఎంత ప్రేమ ఉన్నా సరేగానీ, విదేశీ భాషలను నేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశీ భాషలు నేర్చుకున్న వారిలో తెలివి తేటలు మెరుగవుతాయని, నేర్చుకునే భాషల సంఖ్య పెరిగేకొద్దీ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ప్రాక్టికల్ గా తేలింది.

యూరీ స్టైరోవ్ నేతృత్వంలోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీకి చెందిన రీసెర్చర్స్ బృందం విదేశీ భాషలపై బాగా అవగాహన ఉన్న 22 మంది(10 మంది బాలురు, 12 మంది బాలికలు) విద్యార్థులను ప్రశ్నించి, పరిశీలించి కొన్ని విషయాలను గుర్తించారు. వారి మాతృభాష పదాలు, విదేశీ భాషల పదాలను ప్లే చేసి ఎక్కువ భాషలు తెలిసిన విద్యార్థుల మెదడు పనితీరు చాలా వేగంగా ఉందని వెల్లడించారు. అధిక భాషలపై అవగాహన ఉన్న విద్యార్థులలో చురుకుదనం ఎక్కువగా ఉండి ఎక్కువ విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం ఉంటుందని ఎలక్ట్రాన్ సెఫలోగ్రఫీ(ఈఈజీ) ద్వారా హెల్సింకీ వర్సిటీ బృందం ప్రాక్టియల్ గా వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement