![దగ్గుకు దివ్యౌషధం](/styles/webp/s3/article_images/2017/09/2/81424198834_625x300.jpg.webp?itok=kG3A3eOk)
దగ్గుకు దివ్యౌషధం
ఇది సీజన్ మారుతున్న తరుణం. ఈ సమయంలో చిన్నారులను జలుబు, దగ్గు బాధిస్తుంటాయి. ఇటువంటప్పుడు చాలామంది చేసే పని- మెడికల్ షాపులలో దగ్గుమందు కొనుక్కొచ్చి ఇవ్వడం! అయితే పిల్లలకు అలా విచక్షణా రహితంగా దగ్గుమందులు ఇవ్వడం అంత మంచిది కాదు. దాని బదులు వారికి రెండుస్పూన్లు తేనె నాకించడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.
శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు, దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉంటుందట. అందువల్ల తేనెలోని తీపి, విటమిన్ సి, సహజమైన ఫ్లేవనాయిడ్లు లాలాజలాన్ని పలచబార్చి, దగ్గును తగ్గిస్తాయట. కేవలం దగ్గు వచ్చినప్పుడే కాకుండా రాత్రిపూట పడుకునేముందు రెండుస్పూన్ల తేనెను నాకిస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.