సాక్షి, అమరావతి: మన శరీరంలోనూ, శరీరం బయటా లక్షల బాక్టీరియాలు ఉంటాయి. బాక్టీరియా అనగానే చాలామందికి చెడు చేస్తాయనే అభిప్రాయం ఉంటుంది. కానీ మంచి చేసే బాక్టీరియాలు చెడు బాక్టీరియాల కంటే ఎక్కువగా ఉన్నాయని.. ఇలాంటి బాక్టీరియా కోవిడ్‌ను నియంత్రించేందుకు ఇమ్యూనిటీని పెంచుతాయని చెబుతున్నారు ఔషధ నియంత్రణ శాఖకు చెందిన మైక్రో బయాలజిస్ట్ డా. ప్రవీణ్‌కుమార్.
► పాలు పెరుగుగా మారే ప్రక్రియ వల్ల లాక్టొబాసిల్లస్ అనే బాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ బాక్టీరియా ఇమ్యూనిటీకి దోహదపడే లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.
► వెన్న తయారయ్యే ప్రక్రియలో లాక్టోబాసిల్లస్, లాక్టోకోకస్, ప్రాపియాన్ బాక్టీరియం, బ్రేవి బాక్టీరియం వంటివి ఉత్పత్తి అవుతాయి. హానికారక వైరస్‌లను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. ఇడ్లీ, దోశ వంటివి పులియడం ద్వారాజీర్ణ ప్రక్రియకు ఉపయోగçపడే బాక్టీరీయా ఉత్పత్తి అవుతుంది.
► మనిషి పేగుల్లో బాక్టీరియాడిస్, ఎంటర్‌కోకస్, క్లెబ్సిల్లా, బైఫిడో బాక్టీరియం వంటివి ఉంటాయి. వీటివల్ల వైరస్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుంది.
► పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఉత్పత్తి అయ్యే బాక్టీరియా హానికర బాక్టీరియాను, వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయి.మనిషి శరీరంలో 2వేలకు పైగా మేలు చేసే బాక్టీరియా జాతులుంటాయని ‘నేచర్ జర్నల్’ ప్రచురించింది.
అన్ని బాక్టీరియాలూ చెడ్డవి కావు
Published Mon, Jul 27 2020 3:41 AM | Last Updated on Mon, Jul 27 2020 3:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment