సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..! | Yogurt Consumption For Improving Immune Health | Sakshi
Sakshi News home page

సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!

Published Tue, Oct 15 2024 10:46 AM | Last Updated on Tue, Oct 15 2024 10:55 AM

Yogurt Consumption For Improving Immune Health

ఇటీవల చాలామందికి డాక్టర్లు అత్యంత ఖరీదైన బయాటిక్స్‌ ప్రిస్క్రయిబ్‌ చేస్తుండటం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. జీర్ణవ్యవస్థ  పొడవునా ఉంటూ మనకు మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. అవి ఉండటం వల్లనే వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. అందుకే పెరుగు తినడం అన్నివిధాలా ఆరోగ్యానికి మేలు చేసే విషయం మాత్రమే కాదు... ఎన్నో రకాల వ్యాధులను దూరంగా ఉంచేందుకు ఓ సమర్థమైన  మార్గం కూడా. పెరుగుతో ఉండే ప్రయోజనాలు చూద్దాం. 

  • జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సంఖ్యలో ఉండే బ్యార్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూడటం మాత్రమే కాకుండా... కడుపులో మంటను తగ్గిస్తాయి. 

  • రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్‌ టాబ్లెట్‌ తీసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది నేచురల్‌గా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 

  • దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్‌ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. ∙చర్మంలో తేమ ఎల్లప్పుడూ  ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందన్నది ఆహార నిపుణుల మాట. 

  • పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్‌ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్త΄ోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో ΄ోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్‌ సెంటిఫిక్‌ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. 

  • మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే ల్యాక్టోబాసిల్లస్‌ అసిడోఫిల్లస్‌ బ్యాక్టీరియా అనే మేలు చేసే బ్యాక్టీరియా వల్ల  మహిళల్లో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. 

  • బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్న మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. 

(చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement