సాక్షి, హైదరాబాద్: ఇమ్యూనిటీకి ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పటికే చాలామందికి అర్థమయ్యింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రోగనిరోధకత పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కరోనా థర్డ్‌వేవ్, పిల్లలపై దాని ప్రభావం వార్తల నేపథ్యంలో.. ఒకవేళ అది వస్తే ఎదుర్కొనేందుకు పిల్లలను సంసిద్ధుల్ని చేయాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రులు ఇప్పటినుంచే జాగ్రత్త పడితే వారికి ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారు తీసుకునే అహారంలో తగిన మార్పులు, చేర్పులు చేయాలని, రోగ నిరోధకత పెంచే ఆహారం ఎక్కువగా ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు.
రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో తినే ఆహారం, ఆటపాటలు, నిద్రించే సమయం కీలకపాత్ర పోషిస్తాయి. పిల్లలు అన్నీ ఇష్టంగా తినరు. అందువల్ల వారు ఇష్టపడే ఆహారంలో అవసరమైనవి కలిపి తినిపించాలి. మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలను వండి పెట్టాలి.
ఈ వంటకాలు ప్రయత్నించండి
► చికెన్ + తోటకూర/మెంతికూర
► మటన్ + గోంగూర/ ములక్కాయ/తోటకూర
► ఎగ్ ప్యాండర్+ గ్రీన్‌పీస్ మసాలా
► రాజ్‌మా రైస్+ సోయా చంక్స్ మసాలా
► మింట్ రైస్+ మిక్స్‌డ్ వెజ్ కర్రీ
► బగారా రైస్+ పాలక్ పనీర్
► జీరా రైస్+ దాల్ ఫ్రై, కర్డ్ రైతా
► మిల్లెట్ బిసిబిల్లా బాత్
► మిక్స్‌డ్ వెజ్ సాంబార్+బీన్స్ ఫ్రై,
► టొమాటో కార్న్, మిక్స్‌డ్ వెజ్/మష్రూమ్/చికెన్ సూప్
అవగాహన కల్పించాలి
కరోనా వైరస్ వ్యాప్తి పట్ల పిల్లల్లో కూడా అవగాహన పెరగాలి. ఏడేళ్లలోపు పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను అనుసరించడం చూస్తుంటాం. కాస్త వయసు పెరిగిన పిల్లలైతే పెద్దలు చెప్పే విషయాలను అర్థం చేసుకుంటూ ఇతరులను కూడా అనుసరిస్తుంటారు. ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి పట్ల పిల్లల్లో కూడా అవగాహన పెంచాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే పద్ధతిగా మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, తిరిగి ఇంటికి చేరుకున్న వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం, బయట ఉపరితలాలు తగలకుండా జాగ్రత్తపడడం వంటివి అలవాటు చేయాలి. వైద్య సహాయం కోసం, జనరల్ వ్యాక్సినేషన్ కోసం పిల్లలు ఆస్పత్రులకు వెళ్తుండడం సహజం. అలాంటప్పుడు పూర్తి రక్షణతోనే వెళ్లాలి.
చదవండి: ఓలా ఫౌండేషన్: ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు
Comments
Please login to add a commentAdd a comment