
మన సంస్కృతిలో తాంబూలానికి (తమలపాకు)కు ఎంతో ప్రాధాన్యం ఉంది. దేవుళ్లకి తమలపాకులు తప్పకుండా అర్పిస్తాము. వివిధ శుభ కార్యాలు, నోములు, వ్రతాలు, జరిగినప్పుడు తాంబూలం ఇవ్వడం తప్పనిసరి . తమలపాకులను ఇలా ఇవ్వడం వలన శుభం చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తమలపాకు మన ఆరోగ్యానికి చాలా మేలుచేస్తుంది. ఎముకలకు మేలు చేసే ‘‘ఎ’’ , ‘‘సి’’ విటమిన్ లు, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తాంబూలంలో రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఉంది. తమలపాకులో వుండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.
∙షడ్రసోపేతమైన భోజనం చేశాక పచ్చ కర్పూరం, లవంగాలు, యాలకులు, సోంపు కలసిన తాంబూలం వేసుకుంటే, తిన్న ఆహారం తొందరగా వంటికి పడుతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ∙పాము విషంతో సహా అనేకరకాలయిన విషాలను హరించగల ఔషధ గుణాలు తమలపాకుకి ఉన్నాయట. చిన్న పిల్లలకి జలుబు చేసినపుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి. తమలపాకుతో సున్నం కలిపి వేసుకొంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది. ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment