tambulam
-
ఆడి మాస తాంబూలంలో టమాటాలు
వేలూరు: వేలూరు సమీపంలో తమిళ ఆడి మాస వరుస తాంబూలంగా టమాటాలను అమ్మగారింటి నుంచి ఇచ్చిన పంపిన విషయం పలువురిని విస్మయానికి గురిచేసింది. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలోని కామాక్షిమ్మన్పేట గ్రామానికి చెందిన సత్యతో పల్లిగొండకు చెందిన లీలాప్రియకు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన మొదటి ఆడి మాసాన్ని పురస్కరించుకొని అమ్మగారింటి వారు కుమార్తె, అల్లుడిని వరుస తాంబూలం పెట్టి ఇంటికి తీసుకెళ్లడం తమిళ సంప్రదాయం. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో తమిళ ఆడి మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో లీలాప్రియ కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం సుమారు 25 రకాలైన వరుస తాంబూలంగా పెట్టారు. వీటిలో ద్రాక్ష, కొబ్బరికాయ, ఆపిల్, పుష్పాలు, అరటి పండుతో పాటు ప్రస్తుతం ధరలు భారీగా పెరగడంతో వినూత్నంగా టమాటాలను కూడా చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. -
తాంబూలం గొప్పతనం ఏమిటి?
మన సంస్కృతిలో తాంబూలానికి (తమలపాకు)కు ఎంతో ప్రాధాన్యం ఉంది. దేవుళ్లకి తమలపాకులు తప్పకుండా అర్పిస్తాము. వివిధ శుభ కార్యాలు, నోములు, వ్రతాలు, జరిగినప్పుడు తాంబూలం ఇవ్వడం తప్పనిసరి . తమలపాకులను ఇలా ఇవ్వడం వలన శుభం చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తమలపాకు మన ఆరోగ్యానికి చాలా మేలుచేస్తుంది. ఎముకలకు మేలు చేసే ‘‘ఎ’’ , ‘‘సి’’ విటమిన్ లు, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తాంబూలంలో రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఉంది. తమలపాకులో వుండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ∙షడ్రసోపేతమైన భోజనం చేశాక పచ్చ కర్పూరం, లవంగాలు, యాలకులు, సోంపు కలసిన తాంబూలం వేసుకుంటే, తిన్న ఆహారం తొందరగా వంటికి పడుతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ∙పాము విషంతో సహా అనేకరకాలయిన విషాలను హరించగల ఔషధ గుణాలు తమలపాకుకి ఉన్నాయట. చిన్న పిల్లలకి జలుబు చేసినపుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి. తమలపాకుతో సున్నం కలిపి వేసుకొంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది. ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది. -
అంతరార్థం
భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నా, అరటి లేదా కొబ్బరి కాయలకే ఆది నుంచి అగ్రతాంబూలం. వాటినే పూర్ణఫలాలుగా పేర్కొంటారు. కారణం ఏమిటంటే, సృష్టిలోని అన్ని ఫలాలను మనం ఆరగించి, వాటిలోని విత్తనాలను నోటినుంచి ఊసి పారవేస్తాం. దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలి అవుతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని, వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి, తిరిగి పుష్పించి, ఫలిస్తాయి. మనం తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్ఠం కాదు. అయితే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు. మహాపతివ్రత, సౌందర్యరాశి అయిన సావిత్రిదేవి శాపవశాత్తూ భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. అర టిచెట్టు విత్తనాల ద్వారా గాక పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాల్లోనూ పండ్లను ఇస్తుంది. కొబ్బరిచెట్టు బీజంగల చెట్టే అయినప్పటికీ, దానికి కూడా ఎంగిలి దోషం అంటదు. అందుకే అరటిపండు, కొబ్బరికాయ పూర్ణఫలాలయ్యాయి. వినాయకుడికి, ఆంజనేయస్వామికి, రామచంద్రమూర్తికీ అరటిపండ్లు అమితమైన ప్రీతి గలవి. వారి పూజలో అరటిపండును నివేదించడం తప్పనిసరి అని పెద్దలు చెబుతారు.