
వేలూరు: వేలూరు సమీపంలో తమిళ ఆడి మాస వరుస తాంబూలంగా టమాటాలను అమ్మగారింటి నుంచి ఇచ్చిన పంపిన విషయం పలువురిని విస్మయానికి గురిచేసింది. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలోని కామాక్షిమ్మన్‌పేట గ్రామానికి చెందిన సత్యతో పల్లిగొండకు చెందిన లీలాప్రియకు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన మొదటి ఆడి మాసాన్ని పురస్కరించుకొని అమ్మగారింటి వారు కుమార్తె, అల్లుడిని వరుస తాంబూలం పెట్టి ఇంటికి తీసుకెళ్లడం తమిళ సంప్రదాయం.
ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో తమిళ ఆడి మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో లీలాప్రియ కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం సుమారు 25 రకాలైన వరుస తాంబూలంగా పెట్టారు. వీటిలో ద్రాక్ష, కొబ్బరికాయ, ఆపిల్, పుష్పాలు, అరటి పండుతో పాటు ప్రస్తుతం ధరలు భారీగా పెరగడంతో వినూత్నంగా టమాటాలను కూడా చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment