ధరల మోతతో కూరగాయాల మార్కెట్‌కు వెళ్లేందుకు సామాన్యులు జంకుతున్నారు. ముఖ్యంగా టమాటా ధర చుక్కలను తాకడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. భారీ వర్షాలతో భారీగా పెరిగిన టమాటా ధరలను దించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు టమాటా ధరల పెరుగుదలపై #tomatopricehike హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. సరదా ఫొటోలు, మీమ్స్, వీడియోలను నెటిజనులు ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.
‘మీరు మార్కెట్ నుంచి టమాటా కొనుగోలు చేసిన ప్రతిసారీ ప్రభుత్వం పాన్ కార్డును అడుగుతుంది. కూరగాయల వ్యాపారులు సైతం పాన్‌కార్డు జిరాక్స్ కాపీని అడుగుతున్నారు’ అంటూ ఈ నెటిజన్ సైటర్ వదిలారు. (చదవండి: హైదరాబాద్‌లో నో‘టమాటా’ రావట్లే.. అంత వద్దు ‘అర కిలో చాలు’)
జనం తమను టమాటాలతో కొడతారన్న భయంతోనే పాలకులు వాటి ధరను భారీగా పెంచేశారని మరొకరు హాస్యమాడారు.
ఇప్పుడు ఖరీదైన ఉంగరం ఇదే అంటూ టమాటాతో ఉన్న ఉంగరం ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు టమాటా ఇప్పుడు కొత్త మాణిక్యం (న్యూ రూబీ) అంటూ వెరైటీ నిర్వచనాలు ఇస్తున్నారు.
టమాటా ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలతో పోటీ పడుతున్నాయని పేర్కొంటూ ఉసేన్ బోల్ట్ పరుగు పందెం ఫొటోను షేర్ చేశారు.
ఈ నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. కాస్త కనిపెట్టండి అంటూ పాత ట్వీట్‌ను వెలికితీశారు మరో నెటిజన్.
టమాటా ధరలు ఎంత పెరిగినా ఫర్వాలేదు. ఇలా చేయండి అంటూ కొత్త టెక్నిక్ కనిపెట్టారు. అదేంటో మీరూ చూడండి..
Tomato price hike ?, No problem, Here is the solution 👇🤣🤣🤣#tomatopricehike pic.twitter.com/DqsKgeDuCA
— S℘ıɖɛყ🕸 (@Spidey_e) November 25, 2021
Comments
Please login to add a commentAdd a comment