
క్యారట్... హెల్దీ రూట్!
గుడ్‌ఫుడ్
కంటి చూపు బాగుండటానికి క్యారట్ ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. దానిలో ఉండే విటమిన్–ఏ వల్ల మనకు ఈ ప్రయోజనం కలుగుతుంది. అలాగే క్యారట్ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించి గుండెజబ్బులను నివారిస్తుంది. మేని రంగులో నిగారింపు తెస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థాల కారణంగా అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. మాక్యులార్ డీజనరేషన్ అనే కంటి వ్యాధిని నివారించగల శక్తి క్యారట్‌కు ఉంది. క్యారట్ తినడం వల్ల లాలాజలం ఎక్కువగా ఊరి చిగుర్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. రక్తంలో చక్కెరపాళ్లను సైతం క్యారట్ నియంత్రిస్తుంది.