మీరు మీ బిడ్డలకు చనుబాలు పట్టిస్తున్నారా? అయితే మీరు గర్భసంచి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తప్పినట్టేనని అంటున్నారు బ్రిస్బెన్ (ఆస్ట్రేలియా)లోని క్యూఐఎమ్‌ఆర్ బెర్ఘోఫెర్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. అయితే కేవలం చనుబాలు పట్టించడం అన్న ఒకే ఒక్క ఆరోగ్యకరమైన, స్వాభావికమైన అలవాటుతోనే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు 11 శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
అంతేకాదు... ఈ తాజా అధ్యయనం మాత్రమే గాక... గతంలో నిర్వహించిన పదిహేడు పరిశోధనల్లోనూ ఇదే విషయం తెలిసిందనీ, ఇదే విషయం మరోమారు కచ్చితంగా నిర్ధారణ అయ్యిందని పేర్కొంటున్నారు. గర్భసంచికి వచ్చే క్యాన్సర్‌లను స్వాభావికంగా నివారించే మార్గాల్లో చనుబాలు పట్టించడం చాలా ప్రధానమైనదని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న కీలక పరిశోధకురాలు సుసాన్ జోర్డాన్. ఈ తాజా అధ్యయన ఫలితాలు ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment