మెల్బోర్న్ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అత్యంత అరుదైన టెర్మినల్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ. నిమిషాలు కరిగిపోతున్నాయంటూ బాధపడుతోంది. అంతేగాదు తనతో గడిపే కొత్త వ్యక్తులు ఉంటే రండి అంటూ తనతో స్పెండ్ చేసే సమయాన్ని వేలం పాట వేస్తుంది. ఏంటిదీ అనుకుంటున్నారా..?. నయం చేయలేని ఈ వ్యాధి తనను మింగేసేలోపే జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా వ్యక్తులతో గడపాలని కోరుకుంటోంది. ఆమె ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది..!
అసలేం జరిగిందంటే..32 ఏళ్ల ఎమిలీ లాహే అత్యంత అరుదైన నట్ కార్సినోమాతో బాధపడుతోంది. ఈ కేన్సర్ శరీరంలో మెడ, తల, ఊపరితిత్తుల్లో ఎక్కడైన రావొచ్చు. ఇది చికిత్సకు లొంగని కేన్సర్. అందువల్లే దీన్ని టెర్మినల్ కేన్సర్ అంటారు. అంటే తగినంతగా చికిత్స చేయలేని వ్యాధి అని అర్థం. ఆయుర్దాయం లేదని లేదా ఎక్కువ రోజుల మనుగడ సాధించని పరిస్థితి టెర్మినల్ కేన్సర్ అంటారు.
దీంతో తనకు ప్రతి క్షణం విలువైనవి అంటోంది లాహే. మనిషి సాధారణంగా వర్తమానం తప్పించి భూత, భవిష్యత్తుల గురించి ఆలోచింస్తుంటాడు. కానీ ఈ వ్యాధి సదా వర్తమానంలో ఉండకపోతే క్షణాలు ఆవిరిపోతాయనే ఒక పాఠాన్నినేర్పిందని చెబుతోంది. అందుకే తన చివరి క్షణాలను కూడా ఆనందంగా జీవించాలని భావిస్తోంది. అందుకే ఆ క్షణాలను కొత్త వ్యక్తులతో గడిపేందుకు ఎదురుచూస్తోంది. ప్రతి క్షణం తనకు అత్యంత అమూల్యమైనదని చెబుతోంది. కన్నీళ్ల తెప్పిస్తున్న లాహే మాటలన్ని అక్షర సత్యం.
జీవితం క్షణభంగురం అని చెప్పకనే చెబుతోంది. అందుకు ఇప్పుడే చనిపోతాం అనుకుని జీవిస్తే ప్రతి ఒక్కరూ మంచిగానే ప్రవర్తిస్తారేమో!. నిజానికి లాహే ఈ వ్యాధి నిర్ధారణ కాకమునుపు వరకు ప్రతి రోజు ఐదు నుంచి 10 కిలోమీటర్లు పరిగెత్తేది. మంచి జీవనశైలిని అనుసరించేది. అసలు తను ఇలాంటి వ్యాధి బారిన పడతానని భావించలేదు కూడా. తాను మొదట్లో దీర్ఘకాలిక సైనసైటిస్, తలనొప్పిని అనుభవించింది. ఆ తర్వాత చూపుని కోల్పోవడం వంటి లక్షణాలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చింది.
ఇది కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలకు స్పందించదు. దీంతో జన్యు సంబంధిత ప్రయోగాత్మక చికిత్స చేయాలనుకున్నారు వైద్యులు. అందుకు ప్రభుత్వ మద్దతు లభించడంలో ఎదురైనా అలసత్వం ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయేలా చేసింది. అయినప్పటికీ ప్రతిరోజు బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటానంటోంది. ఇక్కడ కేన్సర్ తమ ప్రియమైన వారిని ఎన్నటికీ దూరం చేయలేదు. ఎందుకంటే..? వారితో గడిపే అమూల్యమైన క్షణాలు గొప్ప జ్ఞాపకాలని అందిస్తాయని భావోద్వేగంగా చెబుతోంది లాహే. .
ఇక్కడ లాహే ఉద్వేగభరితమైన అనుభవం కేన్సర్ వ్యాధులపై మరింతగా పరిశోధనలు చేసే ప్రాముఖ్యతను హైలెట్ చేస్తుంది. కాగా, ఆస్ట్రేలియా ఆరోగ్య సంస్థ ప్రకారం కేన్సర్ మనుగడ రేటు కేవలం 50% మాత్రేమ కానీ 2010కి వచ్చేటప్పటికీ 70%గా ఉంది. చెప్పాలంటే రోగ నిర్థారణ తర్వాత బాధితులు ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. అంతేగాదు ఆస్ట్రేలియన్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అరుదైన కేన్సర్‌లని నయం చేసేలా కొంగొత్త పరిశోధనలకు మద్దతు ఇస్తుండటం గమనార్హం.
(చదవండి: దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!)
Comments
Please login to add a commentAdd a comment