భర్త సజిన్‌తో భావన
వయనాడ్ వారియర్స్..
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.
ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్‌లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.
ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్‌లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్‌ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment