
'నా హృదయం ప్రేమతో నిండిపోయింది'
లాస్ ఏంజెలెస్: హీరోయిన్లు సాధారణంగా తమ వ్యక్తిగత విషయాలు వెల్లడించడానికి ఇష్టపడరు. హాలీవుడ్ నటి లివ్ టేలర్ మాత్రం ఇందుకు మినహాయింపు. తన బిడ్డను పాలిస్తున్న ఫొటోను ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 39 ఏళ్ల లివ్ టేలర్, పియాన్సీ డేవ్ గార్డెనర్ లకు రెండు వారాల క్రితం పాప పుట్టింది. ఆమెకు లూలా రోజ్ గార్డెనర్ అనే పేరు పెట్టారు. తన పాపకు పాలిస్తున్న ఫొటోను లివ్ టేలర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది.
'చనుబాల కోసం నా బిడ్డ పొత్తిళ్లలో ఎంత చక్కగా ఒదిగిందో చూడండి. నాకు అమూల్యమైన బహుమతి ఇచ్చినందుకు కృతజ్ఞురాలినై ఉంటాన'ని టేలర్ పేర్కొంది. లూలా రాకతో తన హృదయం ప్రేమతో నిండిపోయిందని అంది. టేలర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫొటోకు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమెకు ఇప్పటికే మిలో విలియమ్స్, సెయిల్ జీన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. టేలర్ మొదట రోయస్టన్ లాంగ్డన్ ను పెళ్లిచేసుకుంది.