
ముంబై: అనారోగ్యంతో బాధపడుతూ కారులో తన ఏడు నెలల చిన్నారికి పాలిస్తున్న ఓ మహిళ పట్ల ట్రాఫిక్ పోలీసులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం సదరు మహిళ కారు వెనుక సీట్లో కూర్చొని చిన్నారికి పాలిస్తుండగా అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు.. ఆమె కారును తమ వాహనానికి కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. మలాద్(పశ్చిమం)లోని ఎస్వీ రోడ్డులో ఈ దారుణం జరిగింది. వాహనాన్ని ఆపాల్సిందిగా ఆ మహిళ ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసుల మనసు కరగలేదు. ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కారును పోలీస్ వాహనానికి కట్టి లాక్కెళ్లిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శశాంక్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment