ఓ మహిళ గత పది రోజులుగా తీవ్ర కడుపునొప్పిని అనుభవిస్తోంది. భరించలేక ఆస్పత్రికి వెళ్లితే తాను గర్భవతినని తెలుసుకుని షాక్ అయ్యింది. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..ఆ పిండం స్కానింగ్‌లో ఎక్కడ పెరుగుతోంది చూసి వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఒకవేళ గర్భాశయంలో కాక వేరే ఎక్కడ పెరిగినా ఆ పిండం పూర్తిగా మనుగడ సాగించడం అసాధ్యం ఏదో ఒక సందర్భంలో విచ్ఛిత్తి లేదా అబార్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఆమె విషయంలో అలా జరగకపోవడం మరింత విచిత్రం. ఈ షాకింగ్ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్‌కి చెందిన 37 ఏళ్ల మహిళ పదిరోజులుగా తీవ్ర కడుపు నొప్పిని భరిస్తోంది. తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేసి చూడగా ఒక్కసారిగా విస్తుపోయారు వైద్యులు. ఆమె కడుపులో పిండం ప్రేగుల్లో పెరుగుతుండటాన్ని చూసి షాకయ్యారు. నేచరల్‌గా పిండం గర్భశయంలో పెరుగుతుంది. కొందరికి తాము ప్రెగ్నెన్సీ అని తెలియని ఎన్నో మహిళల కేసులు చూశాం. గానీ ఇలా పేగుల్లో బేషుగ్గా పిండం పెరగడం చూడటం ఇదే తొలిసారని వైద్యులు అంటున్నారు.
ఎందుకంటే..? ఒకవేళ పిండం గర్భశయం ట్యూబ్‌లో గాక బయట ఎక్కడ పెరిగినా..పిండవిచ్ఛత్తి అవ్వడం లేదా గర్భం నిలవకపోవడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా పిండం పేగుల్లో నిక్షేపంగా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. సరిగ్గా అప్పుడామె 23 వారాల గర్భవతని కూడా వైద్యులు నిర్థారించారు. ఇలా ప్రేగుల్లో పిండం పెరగడాన్ని 'ఉదర ఎక్టోపిక్ గర్భం' అని పిలుస్తారని చెప్పారు. అయితే వ్యైదులు ఆ మహిళను తమ పర్యవేక్షణ ఉంచుకుని 29 వారాల అనంతరం విజయవంతంగా ఆమెకు ప్రసవం చేశారు.
మూడు నెలల అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇలాంటి ఎక్టోపిక్ గర్భాలు అంతర్గత రక్తస్రావం అయ్యి ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లి, బిడ్డలిద్దరికి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని ఆమెకు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో దాదాపు 90% వరకు శిశువులను కోల్పోయే అవకాశాలే ఎక్కువుగా ఉంటాయని అన్నారు. ఒకవేళ శిశువు జీవించినా కూడా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ ఈ మహిళ విషయంలో అలాంటివి జరగనివ్వకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న శిశువును బయటకు తీయగలిగామని తెలిపారు.
(చదవండి: రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో..)
Comments
Please login to add a commentAdd a comment