mumbai cop
-
రతన్ టాటా శునకం ‘గోవా’పై అసత్య ప్రచారం
ఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, స్వర్గీయ టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86)మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యం వార్తలపై స్పందించిన ఆయన.. బాగున్నానంటూ పోస్టు పెట్టారు. అయితే, గత బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ రతన్ టాటా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ నేపథ్యంలో ‘రతన్ టాటా మరణాన్ని తట్టుకోలేక ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయింది. అందుకే మనుషుల కంటే మూగు జీవాలే నయం అంటూ’ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముంబై యానిమల్ హీరోగా ప్రశంసలందుకుంటున్న సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ అప్రమత్తమయ్యారు. శునకం గోవా మరణంపై వాట్సప్‌లో జరుగుతున్న ప్రచారంపై టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడుతో సంప్రదింపులు జరిపారు. శంతను సైతం శునం గోవా క్షేమంగా ఉందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారని ఎస్సై సుధీర్ కుడాల్కర్ తెలిపారు. శునకం గోవాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. ముంబై యానిమల్ హీరో ఎస్సై సుధీర్ కుడాల్కర్బోరివలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సుధీర్ కుడాల్కర్ జంతు ప్రేమికుడు. ఓ వైపు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ .. మరోవైపు స్టేషన్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో శునకాలు, పిల్లులకు క్రమం తప్పకుండా ఆహారంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. జంతువుల పట్ల ఆయనకున్న పట్ల ప్రేమ, కరుణపై జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’ గుర్తింపు తెచ్చి పెట్టింది.👉చదవండి : ఒక టాటా.. ఒక గోవా! -
‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’
ముంబై : ముంబై పోలీస్ అధికారి చేసిన ఓ పని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఏం చేశాడని అనుకుంటున్నారా. నెలలు నిండని ఓ పసి ప్రాణాన్ని కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్ కోలేకర్ అనే వ్యక్తి ముంబైలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు విధులకు వెళ్తుండగా.. 14 రోజుల శిశువు ప్రమాదవశాస్తు సేప్టీ పిన్ను మింగేసింది. రోడ్డుపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల నుంచి విషయం తెలుసుకున్న కోలేకర్ చిన్నారిని ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబానికి సహాయం చేశాడు. తన సొంత వాహనంలో చిన్నారిని సమయానికి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు శిశువుకు చికిత్స అందిచి సేఫ్టీ పిన్ను బయటకు తీశారు. (టీచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే ) ఈ విషయాన్ని ముంబై పోలీసులు గురువారం ఉదయం ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ‘సెల్యూట్ ముంబై పోలీస్...మీ మీద మాకున్న గౌరవం మరింత పెరిగింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (గుడ్‌న్యూస్: నెలాఖరుకు కోవిడ్-19 డ్రగ్ ) When in doubt, find your nearest cop! A 14 day old baby was choking on a safety pin he had accidentally swallowed. PC S.Kolekar spotted the worried parents on the road & rushed the kid to KEM using his own vehicle, where the child received timely treatment.#MumbaiFirst pic.twitter.com/yCVNxFQKvW — Mumbai Police (@MumbaiPolice) June 18, 2020 -
లాక్డౌన్: సాయం చేస్తానని తోడుగా వచ్చి..
ముంబై: కరోనా లాక్‌డౌన్‌తో భారత్‌లో చిక్కుకున్న కొలంబియా మహిళ పట్ల ముంబై పోలీసు ఒకరు అనుచితంగా వ్యహరించాడు. సాయం చేస్తానని చెప్పి లైంగిక వేధింపులకు దిగాడని ఈ మేరకు బాధితురాలు ముంబై పోలీస్ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. ‘టూరిస్టు వీసాపై భారత్‌కు వచ్చాను. ఫిబ్రవరి 22న ముంబైకి చేరుకుని బాంద్రాలోని ఓ హోటల్లో మార్చి 31 వరకు ఉన్నాను. డబ్బులు అయిపోవడం, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో ఢిల్లీలోని కొలంబియా ఎంబసీని సంప్రదించాను. అయితే, ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో తిరిగి ముంబైకి వెళ్లిపోదామనుకున్నాను. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ పోలీస్ అంధేరీలో లాడ్జ్ వెతికిపెట్టాడు. ఏప్రిల్ 1న లాడ్జ్‌లో దిగాను. అక్కడ సదరు పోలీస్ ప్రవర్తన నన్ను ఇబ్బందులకు గురిచేసింది. నన్ను డ్రింక్ తాగాలని బలవంతం చేశాడు. తిరస్కరించాను. నా ఫోన్‌కు అసభ్యకర మెజేస్‌లు పంపించాడు. నన్ను తాకేందుకు యత్నించాడు. లాడ్జ్ అద్దె తానే చెల్లిస్తానని, తనను రూమ్‌లోకి ఆహ్వానించాలని కోరాడు. అతన్ని బయటికి నెట్టేశాను. (చదవండి: కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరిక) దాంతో అతను నాపై కక్ష కట్టాడు. నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించొద్దని లాడ్జ్ సిబ్బందిని హెచ్చరించాడు. నిత్యవసరాలు లేక నరకం అనుభవించాను. నా వ్యధనంతా వీడియో రూపంలో కొలంబియా అధికారులకు పంపించడంతో వైరల్ అయింది. దానికి స్పందనగా ఏప్రిల్ 18న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఒక డాక్టర్ నా వద్దకు వచ్చి ఆహారం అందించారు. ఆరోగ్య పరీక్షలు చేశారు. క్లిష్ట సమయంలో తోడుగా నిలిచారు. చివరకు ఓ ఎన్జీఓ సాయంతో లాడ్జ్ నుంచి బయటపడి.. వారి సంరక్షణలో ఉన్నాను. కీచక పోలీస్ ఆటకట్టించేందుకే ఫిర్యాదు చేస్తున్నాను’అని పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుపై విచారిస్తామని.. ఆరోపణలు నిజమైతే సదరు పోలీస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుడు సహర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్టున్నట్టు తెలిసింది. (చదవండి: దేశవ్యాప్తంగా 20,000 దాటిన పాజిటివ్ కేసులు) -
అడుక్కుంటాను అనుమతివ్వండి
ముంబై : ప్రభుత్వం నాకు రెండు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి పోలీసు యూనిఫామ్‌లోనే అడుక్కునేందుకు నాకు అనుమతివ్వండి అంటు ముంబై కానిస్టేబుల్ ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు ఒక వినతి పత్రం ఇచ్చారు. ముంబైకి చెందిన ద్యనేశ్వర్ అహిర్రావ్ తొలుత స్థానిక మురోల్ ఆయుధ విభాగంలో పనిచేసేవాడు. కొన్ని రోజుల కిందట ఇతన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి మార్చారు. సరిగా ఆ సమయంలోనే అతని భార్య కాలు విరగడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గాను మార్చి 20 నుంచి 22 వరకు సెలవు పెట్టాడు. ఈ విషయం గురించి ఇంచార్జికి ఫోన్లో తెలియజేసాడు. అనంతరం మరో ఐదు రోజులు కూడా సెలవు తీసుకున్నాడు. భార్యను ఆస్పత్రి నుంచి తీసుకువచ్చిన తర్వాత మార్చి 28న వచ్చి తనకు కేటాయించిన మాతోశ్రీలో విధుల్లో చేరాడు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకూ అతనికి జీతం రాలేదు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో పోలీసు దుస్తుల్లోనే అడుక్కునేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ద్యనేశ్వర్ మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర్ రావుకు అలానే ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాడు. ఆ ఉత్తరంలో తను సెలవు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అందువల్ల తనకు యూనిఫామ్‌లో అడుక్కునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు. దీని గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇంచార్జికి తెలపకుండా విధులకు హాజరు కాని వారికి మాత్రమే జీతం ఇవ్వకుండా ఆపుతారు. అందువల్లే ద్యనేశ్వర్కు రెండు నెలలుగా జీతం ఇవ్వడం లేదని తెలిపారు. ద్యనేశ్వర్ రాసిన లేఖ -
కారులో స్తన్యమిస్తుండగా ఈడ్చుకెళ్లారు!
ముంబై: అనారోగ్యంతో బాధపడుతూ కారులో తన ఏడు నెలల చిన్నారికి పాలిస్తున్న ఓ మహిళ పట్ల ట్రాఫిక్ పోలీసులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం సదరు మహిళ కారు వెనుక సీట్లో కూర్చొని చిన్నారికి పాలిస్తుండగా అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు.. ఆమె కారును తమ వాహనానికి కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. మలాద్(పశ్చిమం)లోని ఎస్వీ రోడ్డులో ఈ దారుణం జరిగింది. వాహనాన్ని ఆపాల్సిందిగా ఆ మహిళ ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసుల మనసు కరగలేదు. ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కారును పోలీస్ వాహనానికి కట్టి లాక్కెళ్లిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శశాంక్‌పై సస్పెన్షన్ వేటు పడింది. -
ఫుల్లుగా తాగి ఎస్సై చెంప వాయించింది
ముంబయి: ఇప్పుడొక వీడియో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ యువతి విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ఘటన ఈ నెల (జూన్)15న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో చూపిన ప్రకారం మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఓ యువతి నేరుగా వెళ్లి ఓ పోలీసుతో వాదనలు పడటమే కాకుండా అసభ్యంగా తిడుతూ కుర్చీలో ఉన్న అతడిపై పదేపదే చేయిచేసుకుంది. దీంతో ఆ యువతి పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? వారి మధ్యలో జరగుతున్న సంభాషణ ఏమిటీ? ఆ యువతి ఎందుకలా ఎస్సైని కొట్టింది? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.