ఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, స్వర్గీయ టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86)మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యం వార్తలపై స్పందించిన ఆయన.. బాగున్నానంటూ పోస్టు పెట్టారు. అయితే, గత బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ రతన్ టాటా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ నేపథ్యంలో ‘రతన్ టాటా మరణాన్ని తట్టుకోలేక ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయింది. అందుకే మనుషుల కంటే మూగు జీవాలే నయం అంటూ’ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముంబై యానిమల్ హీరోగా ప్రశంసలందుకుంటున్న సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ అప్రమత్తమయ్యారు. శునకం గోవా మరణంపై వాట్సప్‌లో జరుగుతున్న ప్రచారంపై టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడుతో సంప్రదింపులు జరిపారు. శంతను సైతం శునం గోవా క్షేమంగా ఉందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారని ఎస్సై సుధీర్ కుడాల్కర్ తెలిపారు. శునకం గోవాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు.
ముంబై యానిమల్ హీరో ఎస్సై సుధీర్ కుడాల్కర్
బోరివలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సుధీర్ కుడాల్కర్ జంతు ప్రేమికుడు. ఓ వైపు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ .. మరోవైపు స్టేషన్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో శునకాలు, పిల్లులకు క్రమం తప్పకుండా ఆహారంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. జంతువుల పట్ల ఆయనకున్న పట్ల ప్రేమ, కరుణపై జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’ గుర్తింపు తెచ్చి పెట్టింది.
👉చదవండి : ఒక టాటా.. ఒక గోవా!
Comments
Please login to add a commentAdd a comment