gov
-
రతన్ టాటా శునకం ‘గోవా’పై అసత్య ప్రచారం
ఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, స్వర్గీయ టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86)మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యం వార్తలపై స్పందించిన ఆయన.. బాగున్నానంటూ పోస్టు పెట్టారు. అయితే, గత బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ రతన్ టాటా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ నేపథ్యంలో ‘రతన్ టాటా మరణాన్ని తట్టుకోలేక ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయింది. అందుకే మనుషుల కంటే మూగు జీవాలే నయం అంటూ’ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముంబై యానిమల్ హీరోగా ప్రశంసలందుకుంటున్న సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ అప్రమత్తమయ్యారు. శునకం గోవా మరణంపై వాట్సప్‌లో జరుగుతున్న ప్రచారంపై టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడుతో సంప్రదింపులు జరిపారు. శంతను సైతం శునం గోవా క్షేమంగా ఉందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారని ఎస్సై సుధీర్ కుడాల్కర్ తెలిపారు. శునకం గోవాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. ముంబై యానిమల్ హీరో ఎస్సై సుధీర్ కుడాల్కర్బోరివలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సుధీర్ కుడాల్కర్ జంతు ప్రేమికుడు. ఓ వైపు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ .. మరోవైపు స్టేషన్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో శునకాలు, పిల్లులకు క్రమం తప్పకుండా ఆహారంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. జంతువుల పట్ల ఆయనకున్న పట్ల ప్రేమ, కరుణపై జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’ గుర్తింపు తెచ్చి పెట్టింది.👉చదవండి : ఒక టాటా.. ఒక గోవా! -
ఉద్రిక్తంగా మారిన బీజేపీ, కాంగ్రెస్ ర్యాలీలు
పనాజీ: గోవాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాఫెల్‌పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తూ.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనాజీలో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అదే సమయంలో ర్యాలీని చేపట్టింది. ఇరువర్గాలు ఎదురుపడటంతో ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. #WATCH Goa: Clash between Congress and BJP workers in Panaji during BJP protest against Congress over Rafale verdict by Supreme Court (21.12.18) pic.twitter.com/E59qbYmQFH — ANI (@ANI) 22 December 2018 -
డివిడెండ్ చెల్లించిన ఎన్‌హెచ్‌డీసీ
భోపాల్ : హైడ్రోపవర్ మేజర్ నర్మదా జలవిద్యుత్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ ) మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించింది. సుమారు రూ 195. 87 కోట్ల డివిడెండ్ ను శుక్రవారం చెల్లించింది. ఈ డివిడెండ్ చెక్కును చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధీమన్ పారిజ్ నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి అప్పగించారు, ఒక అధికారి ఒకరు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ చెక్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుకుందని ఎన్‌హెచ్‌డీసీ సంస్థ అధికారి తెలిపారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, ఎన్‌హెచ్‌పీసీ భాగస్వామ్య సంస్థే ఎన్‌హెచ్‌డీసీ. భోపాల్ కేంద్రంగా 2000 సం.రంలో స్థాపించిన ఈ జాయింట్ వెంచర్ సంస్థ రాష్ట్రంలో హడ్రో పవర్ (జలశక్తి) ఇతర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి దిశగా పనిచేస్తుంది.