Tata Trust
-
రతన్ టాటా శునకం ‘గోవా’పై అసత్య ప్రచారం
ఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, స్వర్గీయ టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86)మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యం వార్తలపై స్పందించిన ఆయన.. బాగున్నానంటూ పోస్టు పెట్టారు. అయితే, గత బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ రతన్ టాటా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ నేపథ్యంలో ‘రతన్ టాటా మరణాన్ని తట్టుకోలేక ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయింది. అందుకే మనుషుల కంటే మూగు జీవాలే నయం అంటూ’ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముంబై యానిమల్ హీరోగా ప్రశంసలందుకుంటున్న సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ అప్రమత్తమయ్యారు. శునకం గోవా మరణంపై వాట్సప్‌లో జరుగుతున్న ప్రచారంపై టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడుతో సంప్రదింపులు జరిపారు. శంతను సైతం శునం గోవా క్షేమంగా ఉందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారని ఎస్సై సుధీర్ కుడాల్కర్ తెలిపారు. శునకం గోవాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. ముంబై యానిమల్ హీరో ఎస్సై సుధీర్ కుడాల్కర్బోరివలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సుధీర్ కుడాల్కర్ జంతు ప్రేమికుడు. ఓ వైపు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ .. మరోవైపు స్టేషన్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో శునకాలు, పిల్లులకు క్రమం తప్పకుండా ఆహారంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. జంతువుల పట్ల ఆయనకున్న పట్ల ప్రేమ, కరుణపై జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’ గుర్తింపు తెచ్చి పెట్టింది.👉చదవండి : ఒక టాటా.. ఒక గోవా! -
వారసుడొచ్చాడు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్ నియామకం
టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. టాటా సామ్రాజ్యానికి కీలకమైన దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్న టాటా ట్రస్టుకు అధిపతిని నియమించేందుకు శుక్రవారం సభ్యులు సమావేశమయ్యారు. అందులో రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.టాటా స్వచ్ఛంద సంస్థలకు బోర్డు ట్రస్టీగా ఉన్న మెహ్లీ మిస్త్రీ కూడా కీలక పదవిని పొందేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న రతన్‌టాటా(86) ఆరోగ్య సమస్యలతో మరణించడంతో తన స్థానంలో తదుపరి ట్రస్ట్ పగ్గాలు చేపట్టేది ఎవరనే చర్చసాగింది. బోర్డు సభ్యులు నోయెల్ టాటాను ఎకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చర్చలకు తెరపడినట్లయింది.రతన్ టాటా వివాహం చేసుకోలేదు. వారసులు లేకపోవడంతో తన సోదరుడు నోయెల్ టాటా ట్రస్ట్ పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నవల్ టాటా, సిమోన్ టాటా దంపతులకు 1957లో నోయెల్ టాటా జన్మించారు. అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు. నోయెల్ టాటా గ్రూప్‌లో వివిధ నాయకత్వ హోదాల్లో విధులు నిర్వహించారు.ఇదీ చదవండి: టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2010-2021 మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని 500 మిలియన్ డాలర్లు(రూ.4200 కోట్లు) నుంచి మూడు బిలియన్ డాలర్లు(రూ.25 వేలకోట్లు)కు చేర్చారు. 1998లో ట్రెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఒకే రిటైల్ స్టోర్ ఉండేది. దాన్ని దేశంవ్యాప్తంగా వ్యాపింపజేసి 700 స్టోర్లకు పెంచారు. -
రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్..
వ్యాపార దక్షత, దాతృత్వ సేవలతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన తిరిగి ఫాలో అవుతున్న ప్రొఫైల్ మాత్రం ఒకే ఒక్కటి. అయితే అది వ్యక్తులకు సంబంధించినది కాదు. టాటా గ్రూపు తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే టాటా ట్రస్ట్‌ను ఆయన ఫాలో అవుతున్నారు. ఇదీ చదవండి: రితేష్ అగర్వాల్ భార్య గురించి తెలుసా..? ఆమె కూడా వ్యాపారవేత్తేనా? 85 ఏళ్ల వయసులోనూ రతన్ టాటా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడూ పోస్టులు పెడుతుంటారు. ప్రత్యేక సందర్భాలను, జ్ఞాపకాలను ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అవి చాలా ప్రత్యేకంగా ఫాలోవర్లను ఆకట్టుకుంటాయి. ఆయన పెట్టే పోస్టులు తక్కువే అయినా ఆయన్ను 85 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా చివరిసారిగా జనవరి 15న పోస్ట్ చేశారు. టాటా ఇండికా కారును ఆవిష్కరించి 25 ఏళ్లయిన సందర్భంగా ఆ కారు పక్కన నిలబడి ఉన్న ఫొటోను రతన్ టాటా షేర్ చేశారు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) టాటా గ్రూపును అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన రతన్ టాటా ప్రస్తుతం టాటా సన్స్ సంస్థకు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. టాటా ట్రస్ట్ కార్యకలాపాలు రతన్ టాటా ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. ఈ ట్రస్టును 1919లో ప్రారంభించారు. గ్రామీణ జీవనోపాధి, విద్య, ఆరోగ్యం, కళలు, చేతివృత్తులు, సంస్కృతిని పెంపొందించే రంగాలలో సంస్థలకు ఈ ట్రస్ట్ ద్వారా చేయూత అందిస్టుంటారు. -
కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..
కరోనాపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది. కరోనా వైరస్ పీడితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమన్నారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు. కరోనా నివారణతోపాటు సహాయక కార్యకలాపాలకు రూ.500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్టు ప్రకటించింది. తాము ఇవ్వనున్న రూ.1,000 కోట్లతో డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్ కిట్లు అందజేయనున్నట్లు టాటా సన్స్ తెలిపింది. కరోనాను అరికట్టే విషయంలో తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చిందని టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో కరోనా కూడా ఒకటని తెలిపారు. రూ.కోటి చొప్పున బీజేపీ ఎంపీల ఎంపీల్యాడ్స్ కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయపడేందుకు తమ పార్టీ ఎంపీలు రూ.1 కోటి చొప్పున ఎంపీల్యాడ్స్ కేటాయించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం విరాళంగా అందిస్తారని తెలిపారు. దీంతోపాటు తమ పార్టీ కార్యకర్తలు లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడే 5 కోట్ల నిరుపేదలకు 21 రోజులపాటు అన్నదానం చేస్తుందన్నారు. బీజేపీకి లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 386 మంది సభ్యులున్నారు. ఒక్కో ఎంపీకి ఎంపీల్యాడ్స్ కింద ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసే వీలుంది. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు తన ఒక నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఎంపీలంతా తమ ఎంపీల్యాడ్స్ నుంచి రూ.కోటి విరాళంగా అందించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు. సన్‌ఫార్మా రూ.25 కోట్లు: కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ తదితర మం దులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక వెంటిలేటర్లు అందిస్తాం: హ్యుండయ్ కరోనాపై పోరుకు దక్షిణ కొరియాలో వినియోగిస్తున్న అత్యాధునిక పరీక్ష కిట్లను అందించనున్న హ్యుండయ్ మోటార్స్ ప్రకటించింది. ఇవి 25 వేల మందికి ఉపయోగపడతాయని తెలిపింది. ఒకరోజు వేతనం ఇవ్వండి: జీఎస్ఐ కరోనాపై పోరులో సర్కారుకు బాసటగా నిలిచేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జోన్ల అధిపతులకు వినతులు పంపినట్లు జీఎస్ఐ డీజీ శ్రీధర్ తెలిపారు. కావాలంటే వెంటిలేటర్లు సరఫరా చేస్తాం: ట్రంప్ కరోనాపై పోరులో మిత్ర దేశాలకు సాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రి ఉత్పత్తిని దేశీయంగా పెంచడంతోపాటు అవసరమైన దేశాలకు వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపిన ట్రంప్.. వెంటిలేటర్లు పంపించాలన్న ఒకే ఒక కోరికను బోరిస్ ఈ సందర్భంగా వెల్లడించారని వ్యాఖ్యానించారు. రానున్న 100 రోజుల్లో తమ కంపెనీలు లక్ష వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నాయన్నారు. -
కరోనాపై పోరు: టాటా ట్రస్ట్ కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 మరణాలు సంభవించగా.. 900 లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో వ్యాపార దిగ్గజం టాటా ట్రస్ట్ కరోనా పోరుకై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ట్విటర్లో ప్రకటన విడుదల చేశారు. ‘యావత్ ప్రపంచం, భారత్ కోవిడ్-19 తో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీన్నుంచి బయటపడాలంటే సత్వర చర్యలు అవసరం. ప్రతీ గంటా ఎంతో విలువైనది. జాతి మొత్తం ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందున్న కష్టతరమైన సవాలు ఇది. టాటా ట్రస్ట్ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తోంది. వైరస్ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికి, బాధితులకు సాయం కోసం రూ.500 కోట్లు కేటాయించాలని నిర్ణయించాం’ అని రతన్ టాటా పేర్కొన్నారు. (చదవండి: నిత్యావసరాలకు మాత్రమే ఓకే..) వైరస్ బాధితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్ పరీక్షలకు టెస్టింగ్ కిట్లు, ప్రజలకు వైరస్‌పై అవగాహన కార్యక్రమాలకు ఈ మొత్తం ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టాటా ట్రస్ట్, టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కలిసి పనిచేస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారినపడి 28 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 6 లక్షలకు పైగా బాధితులుగా మారారు. (చదవండి: అక్కడ లాక్డౌన్ మరో 6 నెలలు!) -
‘ఇండియా జస్టిస్’లో మహారాష్ట్ర టాప్
సాక్షి, న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్ రూపొందించిన ‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్స్‌లో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మహారాష్ట్ర నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13వ స్థానాలు దక్కాయి. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. పౌరులకు న్యాయ సేవలు అందుతున్న తీరుకు అద్దం పట్టే ఈ నివేదికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ ఆవిష్కరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో టాటా ట్రస్టు ఈ నివేదిక రూపొందించింది. నాలుగు కేటగిరీలుగా.. పోలీస్, ప్రిజన్స్, జ్యుడీషియరీ, లీగల్ ఎయిడ్ అనే నాలుగు కేటగిరీలకు వచ్చిన స్కోర్ల ఆధారంగా.. 2015–16, 2016–17, 2017–18, 2018–19 సం వత్సరాల డేటా ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఆయా కేటగిరీల్లో బడ్జెట్, భిన్నత్వం, మానవ వనరులు, మౌలిక వసతులు, పని భారం అంశాల్లో మెరుగైన పనితీరుకు స్కోరు అందించారు. నాలుగు కేటగిరీల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ర్యాంకు కేటాయించారు. 18 పెద్ద, మధ్యస్థాయి రాష్ట్రాలను ఒక విభాగంగా, 7 చిన్న రాష్ట్రాలను మరొక విభాగంగా చేసి ర్యాంకులు ప్రకటించారు. లీగల్ ఎయిడ్ అంశంలో మెరుగైన పనితీరుతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలవగా.. పోలీస్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది. -
ప్రభుత్వం కంటే ‘టాటా’నే నిబద్ధతతో పనిచేస్తోంది
సాక్షి, తిరుపతి: ప్రభుత్వం కంటే టాటా ట్రస్ట్ వారు నిబద్ధతతో పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద టీటీడీ విరాళంగా ఇచ్చిన 25 ఎకరాల విస్తీర్ణంలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఫర్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (శ్రీకార్) సంస్థ నిర్మాణానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి శుక్రవారంఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపిన టాటా ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఏటా 50 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారని, 2020 నాటికి ఈ సంఖ్య 1.50 లక్షలకు చేరే ప్రమాదం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 124 ఆస్పత్రులు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, తిరుపతి ఆస్పత్రి రేడియేషన్ థెరపీకి హబ్‌గా మారనుందని చెప్పారు. కేన్సర్‌పై అవగాహన అవసరమని, చివరి దశలో వ్యాధిని గుర్తిస్తుండడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, ముందుగా గుర్తిస్తే జబ్బును నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తిరుపతి మెడికల్ హబ్‌గా, సెల్‌ఫోన్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. స్మార్ట్ సిటీ కోసం తిరుపతిలో 87 కి.మీ తీసుకోనున్నట్లు వెల్లడించారు. శెట్టిపల్లి వద్ద ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వేను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ పక్కా ఇల్లు వారికి నచ్చిన విధంగా కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనని సీఎం చెప్పుకొచ్చారు. పేదలకు నాణ్యమైన కేన్సర్ వైద్యం అందించటమే లక్ష్యంగా తిరుపతిలో పరిశోధనతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు రతన్ టాటా తెలిపారు. టీటీడీ సహకారంతో పేదలకు సేవలందిస్తామని చెప్పారు. అపోలో నాలెడ్జ్ సెంటర్ సందర్శన చిత్తూరు సమీపంలో ఆపోలో గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలెడ్జ్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆపోలో చైర్మెన్ ప్రతాప్‌రెడ్డి సేవలను ఆయన కొనియాడారు. అపోలో ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలోనే టెలీ మెడిసన్ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో అడ్డుపడుతోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో టాటా, అపోలో గ్రూప్ ప్రతినిధులతో పాటు మంత్రి నారాయణ, టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్‌యాదవ్, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఎంపీలు శివప్రసాద్, కేశినేని నాని, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, సత్యప్రభ, శంకర్‌యాదవ్, తలారి ఆదిత్య, తుడా చైర్మెన్ నరసింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మాటువేసిన మాయదారిరోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఏడాదికి కొత్తగా 58 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారని టాటా ట్రస్టు తెలిపింది. తెలంగాణలో కేన్సర్ వ్యాధి వ్యాప్తిపై ‘టాటా ట్రస్ట్’సమగ్ర ప్రాజెక్టు నివేదిక–2018ను తాజాగా విడుదల చేసింది. కేన్సర్ బారిన పడుతున్న 58 వేల మందిలో 45 వేల మంది కింది మధ్యతరగతి ఆదాయ వర్గాలేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కేన్సర్ బారిన పడుతున్న వారి రేటు పురుషుల్లో లక్షకు 85, స్త్రీలలో 125గా ఉండటం గమనార్హం. అయితే అనేకచోట్ల కేన్సర్ రోగులు నమోదు కావటం లేదు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్షకు 143గా ఈ రేటు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దేశం లో ఈ రేటు పురుషుల్లో 110, స్త్రీలలో 102గా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేన్సర్ రోగుల్లో అత్యధికంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కేన్సర్‌కు గురవుతున్న వారు 23% మంది ఉన్నారు. పొగాకు కారణంగా 15%కేన్సర్‌కు గురవుతున్నారు. 12% మంది గైనిక్ సంబంధిత కేన్సర్‌కు గురవుతున్నారు. థర్డ్ స్టేజ్‌లోనే ఆసుపత్రులకు... ఇతర అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇండియాలో కేన్సర్ పెరుగుదల రేటు తక్కువగా కనిపిస్తుంది. అయితే వాస్తవంగా ఆ పరిస్థితి ఉందని కాదు. తక్కువ కనిపిస్తుండ టానికి ప్రధాన కారణం కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం, రోగం వచ్చినా కూడా నమోదు కాకపోవడంగా నివేదిక తెలిపింది. అంతేకాదు కేన్సర్ సోకిన వారిలో 50 శాతం మంది థర్డ్ స్టేజీలోనే మొదటిసారి వైద్యానికి వస్తున్నారు. దీంతో భారీగా మరణాల రేటు నమోదవుతోంది. పైగా వైద్య వసతి లేకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. భారత్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్సకు రూ.4 లక్షల నుం చి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇప్పు డున్న రోగులకు వైద్యం చేయాలంటేనే దేశవ్యాప్తంగా 850 సమగ్ర ఆసుపత్రులు అవసరం. కేవలం 400 మాత్రమే అందుబాటులో ఉండ గా.. 67 శాతం ప్రైవేట్ రంగంలోనే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణకు వస్తే మొత్తం 25 సమగ్ర కేన్సర్ ఆసుపత్రులుండగా, అం దులో 3 మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నా యి. నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీల్లో కేన్సర్ చికిత్స అందుబాటులో ఉంది. 30 రేడియోథెర పీ మిషన్లు ఉంటే అందులో 25 ప్రైవేట్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. విచిత్రమేమంటే రాష్ట్రంలో 800 ప్రభుత్వ ఆసుపత్రులుంటే, కేవ లం మూడింటిలోనే వ్యాధికి వైద్యం అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి... ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల కేన్సర్లకు చికిత్స అందుబాటులో ఉంది. రోగుల్లో ఎక్కువ మంది దిగువ మధ్య తరగతికి చెందిన వారే ఉంటుండటంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులపై పడుతోంది. అయితే ఆరోగ్యశ్రీ కింద రోగికి రూ.లక్షన్నర వరకే అనుమతి ఉండటంతో చాలావరకు ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు ఏడాదికి 12 వేల మంది కేన్సర్ రోగులకు చికిత్స చేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు 10 వేల మందికి చికిత్స చేస్తున్నాయి. 12 కేంద్రాల్లో చికిత్సకు ప్రతిపాదనలు... రోగుల సంఖ్యకు తగ్గట్లు కేన్సర్ చికిత్స అందుబాటులో లేకపోవడంతో టాటా ట్రస్ట్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిమ్స్సహా 12 కేంద్రాల్లో కేన్సర్ చికిత్స అందజేయాలని ప్రతిపాదించింది. వాటి ద్వారా 70 శాతం రోగులకు చికిత్స అందిస్తారు. పైగా రాష్ట్రంలో ఎక్కడివారైనా ఒకట్రెండు గంటల్లో వెళ్లి వైద్యం చేయించుకునేలా పలుచోట్ల ఆయా కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. అంతేకాదు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలో 250 పడకలతో కేన్సర్ ఆస్పత్రి నెలకొల్పాలని భావిస్తుంది. -
కేన్సర్ కేర్‌పై టాటా ట్రస్ట్‌తో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వ్యాధి, గుర్తింపు, నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణా ప్రభుత్వం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమగ్ర క్యాన్సర్ కేర్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో అండర్ స్టాండింగ్ మెమోరాండంపై సంతకాలు చేసింది. క్యాన్సర్‌ను ప్రాథమికంగానే గుర్తించాలనే ప్రథాన లక్ష్యంతో పాటు అన్ని స్థాయిల్లోనూ ఆరోగ్య సంరక్షణ అందిచాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. శంషాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కే టి రామారావు, ఆరోగ్య మంత్రి సి. లక్ష్మా రెడ్డి, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా సమక్షంలో దీనిపై సంతకాలు చేశారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టాటా మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, నగరంలోని రెండు ప్రముఖ సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ ) రెఫరల్ ఆధారంగా క్లిష్టమైన కేసులను పరిశీలిస్తాయి. దీనికి అదనంగా, జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ, కీమోథెరపీ లాంటి సేవలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేన్సర్‌కు సంబంధించిన రాష్ట్రంలో అత్యధికంగా క్యాన్సర్‌కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రారంభ దశలో వివిధ రకాలైన క్యాన్సర్లను మేము నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా నోటి, రొమ్ము , గర్భాశయ కేన్సర్లను ఆరంభ దశలో గుర్తించి, విశ్లేషించడంతోపాటు, రోగులకు మెరుగైన సేవలందించేందకు సహాయపడుతుందన్నారు. క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించిందని ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు. రోగులపై మెడికల్ పరీక్షలు జరిపారని ఆమె పేర్కొన్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ రోగులకు క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాలలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో టాటా ట్రస్ట్ పబ్లిక్ హెల్త్ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం పట్ల టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందంతో కేన్సర్ రోగులకు ప్రస్తుత ప్రజారోగ్య వ్యవస్థలోనే మెరుగైన చికిత్స లభిస్తుంది. క్యాన్సర్ రోగులు క్లిష్ట సమయాల్లో తప్ప.. ఇతర విషయాలకు హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి తప్పుతుందన్నారు. అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కేన్సర్ కేర్ కార్యక్రమాల అమలు వివిధ దశల్లో ఉన్నాయని టాటా వివరించారు. -
తిరుపతిలో రూ.140 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి
తిరుమల: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా సంస్థ దీనిని నిర్మించనుంది. టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం విషయాన్నితెలియచేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయంలో ఆ మేరకు టాటా ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణన్, టీటీడీ ఈవో సాంబశివరావు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్, ఎండీ వెంకటరమణన్ మాట్లాడుతూ రెండేళ్లలోనే వైద్యశాల నిర్మాణ పనుల పూర్తి చేసి కేన్సర్ రోగులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుపతి అలిపిరికి సమీపంలో 25 ఎకరాల టీటీడీ స్థలాన్ని లీజు కింద టాటా ట్రస్టుకు కేటాయించామన్నారు. రూ.140 కోట్లతో నిర్మించనున్న ఈ ఆస్పత్రికి టాటా ట్రస్టు ద్వారా రూ.100 కోట్లు, రూ.40 కోట్లు భరించేందుకు కొందరు దాతలు ముందుకొచ్చారన్నారు. టాటా ట్రస్టు వారు ఇప్పటికే ముంబాయి, కోల్‌కత్తాలో కేన్సర్ వైద్యశాలలు నిర్వహిస్తున్నారని, త్వరలో తిరుపతిలో వైద్యశాలను నిర్మించి కేన్సర్ రోగులను విశేష సేవలందిస్తుందని వివరించారు. టాటా సంస్థల ట్రస్టీ ఆర్కె.క్రిష్ణకుమార్, టీటీడీ అదనపు ఎఫ్ఎ అండ్ సీఏవో బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో కోదండరామారావు పాల్గొన్నారు. కాగా, కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రవాస భారతీయ భక్తుడు రూ.33 కోట్ల విరాళం ఇప్పటికే అందజేయటం విశేషం. -
ఆరోగ్య రికార్డుల డిజిటైజేషన్
టాటా ట్రస్ట్‌తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్య రికార్డులన్నింటినీ డిజిటైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్‌సీలు మొదలు నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వరకు వచ్చే రోగుల వైద్య వివరాలను ఆన్లైన్లో భద్రపరచనుంది. ఈ బాధ్యతను టాటా ట్రస్ట్‌కు అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుగా పిలిచే ఈ పద్ధతిలో రోగులందరి ఆరోగ్య సమాచార వివరాలను రిపోర్టులతో సహా స్కానింగ్ చేసి ఆన్లైన్లో ఉంచుతారు. సంబంధిత రోగికి కేటాయించిన ఆన్లైన్ నంబర్‌ను ఎంటర్ చేయగానే వారి ఆరోగ్య రికార్డులు వస్తాయి. మరో నంబర్ ఏదైనా ఇచ్చినా ఆధార్ నంబర్‌తోనే సమాచారం వచ్చేలా చేయాలని భావి స్తున్నారు. ఎప్పటిలోగా దీన్ని పూర్తి చేయాలనేది ఖరారు కాలేదని టాటా ట్రస్ట్ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
మహిళలకూ డిజిటల్ విద్య
టాటా ట్రస్ట్‌తో కలిసి గూగుల్ శిక్షణ కోల్‌కతా: దేశంలో స్త్రీ, పురుషుల మధ్య డిజిటల్ (ఇంటర్నెట్ వినియోగం) అసమానతలను తగ్గించడానికి సెర్చ్ దిగ్గజం గూగుల్ నడుం బిగించింది. అందులో భాగంగా టాటా ట్రస్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వివక్ష ఎక్కువగా ఉందని, అక్కడి మహిళలకు ఇంటర్నెట్ను (డేటా) అందిస్తే ఈ అంతరాయం తగ్గుతుందని గూగుల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ సప్న చాద చెప్పారు. ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమం ద్వారా మహిళలకు శిక్షణనిచ్చి, ఇంటర్నెట్ ద్వారా ఎలా లాభపడొచ్చనే విషయాలను వారికి నేర్పిస్తామని సప్న చెప్పారు. ప్రభుత్వ పథకాలు, వాతావరణం, విద్య, పంటలు వంటి తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఎలా సేకరించాలో తెలియజేస్తామని పేర్కొన్నారు. దీని కోసం టాటా ట్రస్ట్ గ్రామీణ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటామని, ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారామె. -
స్మార్ట్‌కు సపోర్ట్
టాటా ట్రస్టు సహకారం సద్వినియోగం చేసుకోండి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ఒప్పందం విజయవాడ : ఆధునిక టెక్నాలజీతో పాటు టాటా ట్రస్టు అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుని ప్రతి గ్రామాన్ని, వార్డును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పంచాయతీలకు అభివృద్ధి వివరాలను తెలియపరిచేందుకు గ్రామ కార్యదర్శులకు ట్యాబ్‌లు ఇస్తామని చెప్పారు. ఎనికేపాడులో 24 కే కన్వెన్షన్ సెంటర్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 264 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్టుతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామాణాభివృద్ధి అదనపు కార్యదర్శి శాంతిప్రియ పాండె, టాటా ట్రస్టు సీఈవో ఆర్.వెంకట్ రామన్ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్‌లు, వార్డుల అభివృద్ధికి టాటా ట్రస్టు సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు స్మార్ట్‌గా ఆలోచించి గ్రామాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారి సహాయం తీసుకోవాలని సూచించారు. కేశినేని నానిని ఆదర్శంగా తీసుకోండి... ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చొరవ చూపించి టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటాతో సంప్రదింపులు చేసి నియోజకవర్గంలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు కృషి చే శారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. రతన్‌టాటా దేశం గర్వించదగిన వ్యక్తని, ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు దీటుగా టాటా గ్రూపును అభివృద్ధి చేశారని తెలిపారు. నానో టెక్నాలజీని మన దేశం కూడా చేయగలదని నిరూపించారని కొనియాడారు. చంద్రబాబుతో ఎంతోకాలంగా అనుబంధం... చంద్రబాబుతో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని రతన్‌టాటా అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే చొరవ ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ టాటా ట్రస్టు వెదురు పెంపకం, మత్స్య, పౌష్టికాహారం, గ్రామాల అభివృద్ధి సూక్ష ప్రణాళిక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. విజయవాడ బాంబూ (వెదురు) మిషన్ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి, రతన్‌టాటాలు సంయుక్తంగా ప్రారంభించారు. వెదురు మిషన్ అమలుకు కృషి చేసిన ఆదర్శరైతు సీతారాం ప్రసాద్, డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌లను సీఎం అభినందించారు. రతన్‌టాటా, చంద్రబాబులపై కేశినేని నాని కుమార్తెలు శ్వేత, హేమలు రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, శాసనసభ్యులు జలీల్‌ఖాన్, రక్షణనిధి, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్, కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు. బిజీబిజీగా రతన్‌టాటా... టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటా విజయవాడలో ఒకరోజు పర్యటన బిజీబిజీగా గడిపారు. సీఎం చంద్రబాబుతో రతన్‌టాటా, ఎంపీ కేశినేని నాని సమావేశం నిర్వహించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం 24 కే కన్వెన్షన్ హాలులో జరిగిన జరిగిన సమావేశంలో పాల్గొని విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై అంగీకారం కుదుర్చుకున్నారు. -
బెజవాడపై టాటా చూపు!
గ్రామాల అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళిక ఆవిష్కరణ ఇప్పటికే సమగ్ర సర్వే పూర్తి ఎంపీ కేశినేని శ్రీనివాస్ కృషి విజయవాడ : టాటా ట్రస్టు అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎంపీ కేశినేని కోరారు. దీనికి రతన్ టాటా అంగీకరించడంతో టాటా ట్రస్టు తరఫున ప్రతినిధులు ఇక్కడికొచ్చి 1400 మంది యువకులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇప్పించి నియోజకవర్గంలో జనాభా గురించి సమగ్రంగా సర్వే చేయించారు. నియోజకవర్గంలోని గ్రామా ల అభివృద్ధి కోసం నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు వెదురు సాగు వంటి లాభదాయక పంటలు పండించటంపై శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడానికి టాటా ట్రస్టు కృషి చేయనుంది. దీనికి సంబంధించి తయారు చేసిన సూక్ష్మ ప్రణాళికను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, రతన్ టాటాలు ఆవిష్కరిస్తారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నియోజకవర్గ అభివృద్ధిపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు టాటా ట్రస్టు నుంచి వచ్చే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తారు. టాటా పర్యటన సాగేదిలా... రతన్ టాటా ఉదయం 10 గంటలకు ముంబయి నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. ఆయనకు టాటా ట్రస్టు ప్రతినిధులు అద్దేపల్లి శ్రీనివాస్, ఆర్.వెంకట్, ఎస్.దూబే, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌లు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 11.30 నుంచి 1.30 వరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.45 నుంచి 3 గంటల వరకు సుమారు 25 మంది పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రితో కలిసి హోటల్ గేట్‌వేలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి విలేకరుల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.35 గంటల వరకు రామవరప్పాడులోని 24 కే హోటల్లో జరిగే స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమంలో పాల్గొని సీఎంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై అవగాహన పత్రంపై సంతకం చేస్తారు. సాయంత్రం ఆరు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళతారు. 24 కే కన్వెన్షన్ సెంటర్లో జరిగే పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు సమావేశంలో సాయంత్రం 5.10 నుంచి 5.20 వరకు రతన్‌టాటా, 5.20 నుంచి 5.35 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ట