బెజవాడపై టాటా చూపు! | Tata Show on Bezawada | Sakshi
Sakshi News home page

బెజవాడపై టాటా చూపు!

Published Mon, Aug 24 2015 1:14 AM | Last Updated on Tue, Aug 7 2018 4:38 PM

Tata Show on Bezawada

గ్రామాల అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళిక ఆవిష్కరణ
 ఇప్పటికే సమగ్ర సర్వే పూర్తి
 ఎంపీ కేశినేని శ్రీనివాస్ కృషి


విజయవాడ : టాటా ట్రస్టు అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎంపీ కేశినేని కోరారు. దీనికి రతన్ టాటా అంగీకరించడంతో టాటా ట్రస్టు తరఫున ప్రతినిధులు ఇక్కడికొచ్చి 1400 మంది యువకులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇప్పించి నియోజకవర్గంలో జనాభా గురించి సమగ్రంగా సర్వే చేయించారు. నియోజకవర్గంలోని గ్రామా ల అభివృద్ధి కోసం నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు వెదురు సాగు వంటి లాభదాయక పంటలు పండించటంపై శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడానికి టాటా ట్రస్టు కృషి చేయనుంది. దీనికి సంబంధించి తయారు చేసిన సూక్ష్మ ప్రణాళికను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, రతన్ టాటాలు ఆవిష్కరిస్తారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నియోజకవర్గ అభివృద్ధిపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు టాటా ట్రస్టు నుంచి వచ్చే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తారు.
 
టాటా పర్యటన సాగేదిలా...
 రతన్ టాటా ఉదయం 10 గంటలకు ముంబయి నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. ఆయనకు టాటా ట్రస్టు ప్రతినిధులు అద్దేపల్లి శ్రీనివాస్, ఆర్.వెంకట్, ఎస్.దూబే, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌లు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 11.30 నుంచి 1.30 వరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.45 నుంచి 3 గంటల వరకు సుమారు 25 మంది పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రితో కలిసి హోటల్ గేట్‌వేలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి విలేకరుల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.35 గంటల వరకు రామవరప్పాడులోని 24 కే హోటల్‌లో జరిగే స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమంలో పాల్గొని సీఎంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై అవగాహన పత్రంపై సంతకం చేస్తారు. సాయంత్రం ఆరు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళతారు. 24 కే కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు సమావేశంలో సాయంత్రం 5.10 నుంచి 5.20 వరకు రతన్‌టాటా, 5.20 నుంచి 5.35 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ట
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement