వ్యాపార దక్షత, దాతృత్వ సేవలతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన తిరిగి ఫాలో అవుతున్న ప్రొఫైల్ మాత్రం ఒకే ఒక్కటి. అయితే అది వ్యక్తులకు సంబంధించినది కాదు. టాటా గ్రూపు తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే టాటా ట్రస్ట్‌ను ఆయన ఫాలో అవుతున్నారు.
ఇదీ చదవండి: రితేష్ అగర్వాల్ భార్య గురించి తెలుసా..? ఆమె కూడా వ్యాపారవేత్తేనా?
85 ఏళ్ల వయసులోనూ రతన్ టాటా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడూ పోస్టులు పెడుతుంటారు. ప్రత్యేక సందర్భాలను, జ్ఞాపకాలను ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అవి చాలా ప్రత్యేకంగా ఫాలోవర్లను ఆకట్టుకుంటాయి. ఆయన పెట్టే పోస్టులు తక్కువే అయినా ఆయన్ను 85 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా చివరిసారిగా జనవరి 15న పోస్ట్ చేశారు. టాటా ఇండికా కారును ఆవిష్కరించి 25 ఏళ్లయిన సందర్భంగా ఆ కారు పక్కన నిలబడి ఉన్న ఫొటోను రతన్ టాటా షేర్ చేశారు.
టాటా గ్రూపును అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దిన రతన్ టాటా ప్రస్తుతం టాటా సన్స్ సంస్థకు గౌరవ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. టాటా ట్రస్ట్ కార్యకలాపాలు రతన్ టాటా ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. ఈ ట్రస్టును 1919లో ప్రారంభించారు. గ్రామీణ జీవనోపాధి, విద్య, ఆరోగ్యం, కళలు, చేతివృత్తులు, సంస్కృతిని పెంపొందించే రంగాలలో సంస్థలకు ఈ ట్రస్ట్ ద్వారా చేయూత అందిస్టుంటారు.
Comments
Please login to add a commentAdd a comment