టాటా ట్రస్ట్‌తో ఎంఎయూ సందర్భంగా టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా, మంత్రులు కె.టి.రామారావు, సి లక్ష్మా రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వ్యాధి, గుర్తింపు, నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణా ప్రభుత్వం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమగ్ర క్యాన్సర్ కేర్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో అండర్ స్టాండింగ్ మెమోరాండంపై సంతకాలు చేసింది. క్యాన్సర్‌ను ప్రాథమికంగానే గుర్తించాలనే ప్రథాన లక్ష్యంతో పాటు అన్ని స్థాయిల్లోనూ ఆరోగ్య సంరక్షణ అందిచాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. శంషాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కే టి రామారావు, ఆరోగ్య మంత్రి సి. లక్ష్మా రెడ్డి, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా సమక్షంలో దీనిపై సంతకాలు చేశారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టాటా మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా, నగరంలోని రెండు ప్రముఖ సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ ) రెఫరల్ ఆధారంగా క్లిష్టమైన కేసులను పరిశీలిస్తాయి. దీనికి అదనంగా, జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ, కీమోథెరపీ లాంటి సేవలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేన్సర్‌కు సంబంధించిన రాష్ట్రంలో అత్యధికంగా క్యాన్సర్‌కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రారంభ దశలో వివిధ రకాలైన క్యాన్సర్లను మేము నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా నోటి, రొమ్ము , గర్భాశయ కేన్సర్లను ఆరంభ దశలో గుర్తించి, విశ్లేషించడంతోపాటు, రోగులకు మెరుగైన సేవలందించేందకు సహాయపడుతుందన్నారు.
క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించిందని ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు. రోగులపై మెడికల్ పరీక్షలు జరిపారని ఆమె పేర్కొన్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ రోగులకు క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాలలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో టాటా ట్రస్ట్ పబ్లిక్ హెల్త్ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం పట్ల టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందంతో కేన్సర్ రోగులకు ప్రస్తుత ప్రజారోగ్య వ్యవస్థలోనే మెరుగైన చికిత్స లభిస్తుంది. క్యాన్సర్ రోగులు క్లిష్ట సమయాల్లో తప్ప.. ఇతర విషయాలకు హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి తప్పుతుందన్నారు. అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కేన్సర్ కేర్ కార్యక్రమాల అమలు వివిధ దశల్లో ఉన్నాయని టాటా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment