join hands
-
క్వాంటమ్ ఎనర్జీ, బైక్ బజార్ టైఅప్: ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ ‘క్వాంటమ్ ఎనర్జీ’, బైక్ బజార్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ప్రీ ఓన్డ్ (అప్పటికే వేరొకరు వినియోగించి విక్రయించేవి), నూతన వాహనాలకు బైక్ బజార్ రుణ సేవలు అందిస్తుంటుంది. ఈ భాగస్వామ్యం కింద వీలైనంత అధిక సంఖ్యలో క్వాంటమ్ బిజినెస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు బైక్ బజార్ రుణ సదుపాయం అందించనుంది. ఒక్క చార్జ్‌తో 135 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీకి మూడేళ్లు లేదా 90వేల కిలోమీటర్ల వరకు కంపెనీ వారంటీ ఇస్తోంది. ఇదీ చదవండి: చైనాను బీట్ చేసి మరీ, దూసుకొచ్చిన భారత్ -
కేన్సర్ కేర్‌పై టాటా ట్రస్ట్‌తో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వ్యాధి, గుర్తింపు, నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణా ప్రభుత్వం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమగ్ర క్యాన్సర్ కేర్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో అండర్ స్టాండింగ్ మెమోరాండంపై సంతకాలు చేసింది. క్యాన్సర్‌ను ప్రాథమికంగానే గుర్తించాలనే ప్రథాన లక్ష్యంతో పాటు అన్ని స్థాయిల్లోనూ ఆరోగ్య సంరక్షణ అందిచాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. శంషాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కే టి రామారావు, ఆరోగ్య మంత్రి సి. లక్ష్మా రెడ్డి, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా సమక్షంలో దీనిపై సంతకాలు చేశారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టాటా మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, నగరంలోని రెండు ప్రముఖ సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ ) రెఫరల్ ఆధారంగా క్లిష్టమైన కేసులను పరిశీలిస్తాయి. దీనికి అదనంగా, జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ, కీమోథెరపీ లాంటి సేవలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేన్సర్‌కు సంబంధించిన రాష్ట్రంలో అత్యధికంగా క్యాన్సర్‌కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రారంభ దశలో వివిధ రకాలైన క్యాన్సర్లను మేము నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా నోటి, రొమ్ము , గర్భాశయ కేన్సర్లను ఆరంభ దశలో గుర్తించి, విశ్లేషించడంతోపాటు, రోగులకు మెరుగైన సేవలందించేందకు సహాయపడుతుందన్నారు. క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించిందని ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు. రోగులపై మెడికల్ పరీక్షలు జరిపారని ఆమె పేర్కొన్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ రోగులకు క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాలలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో టాటా ట్రస్ట్ పబ్లిక్ హెల్త్ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం పట్ల టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందంతో కేన్సర్ రోగులకు ప్రస్తుత ప్రజారోగ్య వ్యవస్థలోనే మెరుగైన చికిత్స లభిస్తుంది. క్యాన్సర్ రోగులు క్లిష్ట సమయాల్లో తప్ప.. ఇతర విషయాలకు హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి తప్పుతుందన్నారు. అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కేన్సర్ కేర్ కార్యక్రమాల అమలు వివిధ దశల్లో ఉన్నాయని టాటా వివరించారు. -
టీవీ మార్కెట్‌పై కన్ను
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో, చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి జట్టు కట్టనున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో లీడర్‌గా ఉన్న షావోమి టీవీ మార్కెట్లో కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ఇండియాలోకి తీసుకురానున్న షావోమి టీవీలను జియో రీటైల్ దుకాణాల్లో లాంచ్ చేసేందుకు యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్య చర్చలు నడుస్తున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ స్టోర్ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తున్న షావోమి ఆఫ్‌లైన్ విక్రయాలపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భాగస్వాముల కోసం చూస్తోంది. అలాగే వినియోగదారుల ఉత్పత్తులు మాత్రమే కాకుండా, బీ టూ బీ ఉత్పత్తులను కూడా ఇండియాకు తీసుకురావాలని ఆశ పడుతోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, షావోమి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల మధ్య ఈ మేరకు పలుమార్లు చర్చలు జరిపాయి. చర్చలు ఒక కొలిక్కి వచ్చి..ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. ఈ ఏడాది నుంచే రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్స్ ద్వారా ఎంఐ, రెడ్ మీ బ్రాండ్లను విక్రయించనుంది. అలాగే షావోమీ టీవీలను కూడా విక్రయించనుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి ఇతర దిగ్గజ సంస్థల ధరలతో పోలిస్తే సరసమైన ధరలకు ఫీచర్, రిచ్, హై ఎండ్ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. కాగా పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం భారతదేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించిన షావోమి 2018 లో తన ఆన్లైన్ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. -
ఒకేచోట ఇద్దరు చంద్రులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన తెలంగాణ, ఏపీ సీఎంలు బాబుకు కేసీఆర్ షేక్‌హ్యాండ్.. భుజం తట్టిన చంద్రబాబు బాబును సాదరంగా గవర్నర్ వద్దకు తోడ్కొని వెళ్లిన కేసీఆర్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం ప్రణబ్‌కు పాదాభివందనం చేసిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇద్దరు చంద్రులు ఒకేచోట కలిశారు.. పరస్పరం కరచాలనం చేసుకున్నారు.. నవ్వుతూ పలకరించుకున్నారు.. ఒకరు భుజం తట్టి అభినందిస్తే, మరొకరు సాదరంగా తోడ్కొని గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు.. ఆ ఇద్దరు చంద్రుల్లో ఒకరు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు కాగా మరొకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ప్రణబ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరై ప్రణబ్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ హడావుడి స్పష్టంగా కన్పించింది. ఆయన వేదిక వద్ద అటూఇటూ తిరుగుతూ, నేతలందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు. అయితే చంద్రబాబు, కేసీఆర్ ఎదురుపడగానే నవ్వుతూ పలకరించుకున్నప్పటికీ.. కొద్ది నిమిషాల తర్వాత ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరిగిన సన్నివేశాలు.. మధ్యాహ్నం 2.30: తెలంగాణ సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వ చ్చారు. ఆ సమయానికి ఇద్దరు మంత్రులు, అధికారులు మినహా ఎవరూ లేరు. కేసీఆర్ వచ్చిన ఐదు నిమిషాల తరువాత మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకుల రాక మొదలైంది. 2.50: గవర్నర్ నరసింహన్ రాక. సాదరంగా ఆహ్వానిం చిన కేసీఆర్ ఆయనను స్వాగత వేదిక వద్దకు తీసుకె ళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో గవర్నర్ నవ్వుతూ చలోక్తులు! 3.00: తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి రాక. 3.07: హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాక.. ఆయనను కేసీఆర్ పలకరిస్తూ మీ కోసమే ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. మాజిద్ ఒంటిపై సంప్రదాయ వస్త్రం కనిపించకపోవడంతో ‘మీ సంప్రదాయ వస్త్రధారణ ఏమైంది?’ అని అడిగారు. ఆ వెంటనే మాజిద్ తన వ్యక్తిగత సిబ్బందిని పిలిచి ఆయన వద్దనున్న సంప్రదాయ వస్త్రాన్ని ధరించారు. 3.10: ఏపీ సీఎం చంద్రబాబు రాక.. స్వాగత వేదిక ముఖద్వారం వద్ద నిలుచున్న కేసీఆర్ నవ్వుతూ బాబును పలకరించారు. ఇరువురూ కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు కేసీఆర్ భుజం తట్టగా... కేసీఆర్ బాబును సాదరంగా తోడ్కొని వెళ్లి గవర్నర్ పక్కన కూర్చోబెట్టారు. 3.13: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వచ్చారు. 3.15: భారత వాయుసేన ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది.. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ, ఏపీ సీఎంలు, హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ విమానం వద్దకు వెళ్లారు. తెలంగాణ డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, టి.రాజయ్యతోపాటు స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా వెళ్లబోగా ప్రోటోకాల్ అధికారులు వారించి, స్వాగత వేదిక వద్ద వేచి ఉండాలని కోరారు. 3.25: ప్రణబ్ విమానంలోంచి బయటకు వచ్చారు. గవర్నర్, చీఫ్ జస్టిస్, తెలంగాణ, ఏపీ సీఎంలు, నగర మేయర్ స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రణబ్ పాదాలకు నమస్కరించారు. 3.30: స్వాగతించిన వారందరినీ పలకరించిన రాష్ట్రపతి ప్రత్యేక వాహనంలో వెళ్లి సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వేచి ఉన్న స్వాగత కార్యక్రమ వేదిక వద్దకు వచ్చారు. కేసీఆర్ వారందరినీ రాష్ట్రపతికి పరిచయం చేశారు. 3.45: వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి బయలుదేరారు. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, కేసీఆర్ కూడా అదే హెలికాప్టర్లో వెళ్లారు. 6.00: రాష్ట్రపతి తిరిగి విమానాశ్రయానికి వచ్చారు. గవర్నర్, కేసీఆర్, సీజే జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా కూడా రాష్ట్రపతితో పాటు వచ్చారు. చంద్రబాబు, నగర మేయర్ అప్పటికే అక్కడ వేచి ఉన్నారు. 6.10: ప్రణబ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.