Quantum Energy, Bike Bazaar Join Hands For EV Finance - Sakshi
Sakshi News home page

క్వాంటమ్‌ ఎనర్జీ, బైక్‌ బజార్‌ టైఅప్‌: ఎందుకో తెలుసా?

Published Tue, Jul 11 2023 1:08 PM | Last Updated on Tue, Jul 11 2023 1:19 PM

Quantum Energy, Bike Bazaar Join Hands For EV Finance - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల స్టార్టప్‌ ‘క్వాంటమ్‌ ఎనర్జీ’, బైక్‌ బజార్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ప్రీ ఓన్డ్‌ (అప్పటికే వేరొకరు వినియోగించి విక్రయించేవి), నూతన వాహనాలకు బైక్‌ బజార్‌ రుణ సేవలు అందిస్తుంటుంది. ఈ భాగస్వామ్యం కింద వీలైనంత అధిక సంఖ్యలో క్వాంటమ్‌ బిజినెస్‌ ప్రో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు బైక్‌ బజార్‌ రుణ సదుపాయం అందించనుంది. ఒక్క చార్జ్‌తో 135 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్‌ లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీకి మూడేళ్లు లేదా 90వేల కిలోమీటర్ల వరకు కంపెనీ వారంటీ ఇస్తోంది.   

ఇదీ చదవండి: చైనాను బీట్‌ చేసి మరీ, దూసుకొచ్చిన భారత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement