సాక్షి, న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్ రూపొందించిన ‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్స్‌లో 18 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మహారాష్ట్ర నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13వ స్థానాలు దక్కాయి. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. పౌరులకు న్యాయ సేవలు అందుతున్న తీరుకు అద్దం పట్టే ఈ నివేదికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ ఆవిష్కరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో టాటా ట్రస్టు ఈ నివేదిక రూపొందించింది.
నాలుగు కేటగిరీలుగా..
పోలీస్, ప్రిజన్స్, జ్యుడీషియరీ, లీగల్ ఎయిడ్ అనే నాలుగు కేటగిరీలకు వచ్చిన స్కోర్ల ఆధారంగా.. 2015–16, 2016–17, 2017–18, 2018–19 సం వత్సరాల డేటా ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఆయా కేటగిరీల్లో బడ్జెట్, భిన్నత్వం, మానవ వనరులు, మౌలిక వసతులు, పని భారం అంశాల్లో మెరుగైన పనితీరుకు స్కోరు అందించారు. నాలుగు కేటగిరీల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ర్యాంకు కేటాయించారు. 18 పెద్ద, మధ్యస్థాయి రాష్ట్రాలను ఒక విభాగంగా, 7 చిన్న రాష్ట్రాలను మరొక విభాగంగా చేసి ర్యాంకులు ప్రకటించారు. లీగల్ ఎయిడ్ అంశంలో మెరుగైన పనితీరుతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలవగా.. పోలీస్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment