మహిళలకూ డిజిటల్ విద్య
టాటా ట్రస్ట్‌తో కలిసి గూగుల్ శిక్షణ
కోల్‌కతా: దేశంలో స్త్రీ, పురుషుల మధ్య డిజిటల్ (ఇంటర్నెట్ వినియోగం) అసమానతలను తగ్గించడానికి సెర్చ్ దిగ్గజం గూగుల్ నడుం బిగించింది. అందులో భాగంగా టాటా ట్రస్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వివక్ష ఎక్కువగా ఉందని, అక్కడి మహిళలకు ఇంటర్నెట్‌ను (డేటా) అందిస్తే ఈ అంతరాయం తగ్గుతుందని గూగుల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ సప్న చాద చెప్పారు. ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమం ద్వారా మహిళలకు శిక్షణనిచ్చి, ఇంటర్నెట్ ద్వారా ఎలా లాభపడొచ్చనే విషయాలను వారికి నేర్పిస్తామని సప్న చెప్పారు. ప్రభుత్వ పథకాలు, వాతావరణం, విద్య, పంటలు వంటి తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఎలా సేకరించాలో తెలియజేస్తామని పేర్కొన్నారు. దీని కోసం టాటా ట్రస్ట్ గ్రామీణ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటామని, ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారామె.