internet use
-
ఇంటర్నెట్ వాడకం: వీరిలోనే ఒంటరితనం అధికం!
లండన్ : లాక్డౌన్ కాలంలో సాధారణ సమయంలో కంటే ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం విపరితంగా పెరిగిపోయింది. అయితే తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో సరికొత్త విషయం వెలుగు చూసింది. వృద్దుల్లో అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళుతున్న వారి కంటే రోజూ ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. రోజువారీ ఇంటర్నెట్ వాడకం సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చని జర్నల్ ఏజింగ్ అండ్ సొసైటీ ఇటీవల జరిపిన పరిశోధనలో రుజువైంది. ఇందుకు ఇంగ్లాండ్‌లోని సగటు వయస్సు 64 ఏళ్లు ఉన్న 4492 మంది నుంచి డేటాను సేకరించారు. వీరిలో 19 శాతం మందిలో ఒంటరితనం అధికంగా ఉన్నట్లు, 33 శాతం మంది సామాజికంగా ఒంటరిగా ఉంటున్నట్లు తేలింది. అంటే వీరు కుటుంబంతో సరిగానే ఉండవచ్చు కానీ వీరిలో సామాజిక సంబంధాలు తక్కువగా ఉంటాయి. (25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం) రోజూ ఇంటర్నెట్ వాడుతున్న వారి కంటే.. వారానికి, నెలకొకసారి ఇంటర్నెట్ను వినియోగించే వృద్ధులు సామాజికంగా ఒంటరిగా ఉండే అవకాశం తక్కువ ఉన్నట్లు యూకేలోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో తేలింది. సమాచారం శోధించడం, ఈమెయిల్ పంపడం, ఆన్లైన్ షాపింగ్.. ఈ మూడు ఆన్లైన్లో ఎక్కువగా చేసే పనులు. మూడింట రెండు వంతుల మంది(69 శాతం) ప్రతిరోజు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్లు తేలింది. దీనిపై పీహెచ్డీ స్టూడెంట్ స్టాక్‌వెల్ మాట్లాడుతూ.. రోజూ ఇంటర్నెట్ను వినియోగించే వారి సామాజిక ఒంటరితనం, అసలు ఇంటర్నెట్ ఉపయోగించని వారి స్థాయి ఇంచుమించు ఒకే విధంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. తరచుగా ఆన్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల కొంతమంది వృద్ధులకు చుట్టూ ఉన్నవారితో భౌతిక దూరం పెరగడంతో ఎక్కువ సామాజిక ఒంటరితనం ఏర్పడుతుందన్నారు. (లాక్డౌన్ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది) -
ఇంటర్నెట్ వాడకంపై సంచలన విషయాలు
న్యూఢిల్లీ : ప్రపంచమే ఇంటర్నెట్ మయంగా మారిపోయిన కాలం.. మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ గణనీయంగా వ్యాప్తి చెందుతున్న రోజులివి. కానీ భారత్‌లో ఇంటర్నెట్ వాడకంపై మాత్రం సంచలన విషయాలే వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యలో వయసున్న వారిలో కేవలం 19 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారట. ఈ వయసున్న వారిలో 35 శాతం మందే ఇంటర్నెట్ తెలిసిన వారు ఉంటున్నారని తాజా రిపోర్టు నివేదించింది. ‘ఆఫ్టర్యాక్సస్ : ఐసీటీ యాక్సస్ అండ్ యూజ్ ఇన్ ఇండియా అండ్ ది గ్లోబల్ సౌత్’ పేరుతో లిర్న్‌ఆసియా, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రిపోర్టును ప్రచురించింది. భారత్‌లో ఇంటర్నెట్ వాడకం ఎంత తక్కువగా ఉందో తెలుపుతూ ఈ రిపోర్టును నివేదించింది. భారత్‌లో ఇంటర్నెట్ గురించి అవగాహన లేకపోవడమే అతిపెద్ద సమస్య అని ఈ రిపోర్టు పేర్కొంది. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కేవలం 35 శాతం మందికే ఇంటర్నెట్ ఏమిటన్నది అవగాహన ఉందని, అత్యంత తక్కువగా 19 శాతం మంది మాత్రమే దీన్ని వాడుతున్నారని రిపోర్టు నివేదించింది. ప్రపంచంలో అత్యంత అఫార్డబుల్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని లెర్న్‌ఆసియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెర్న్‌ఆసియా హిలాని గల్పాయా చెప్పారు. కానీ ఇంటర్నెట్ వాడకం ఇంకా తక్కువగానే ఉందన్నారు. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యనున్న మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 27 శాతం మంది మాత్రమే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్నారని పేర్కొన్నారు. -
మెసేజ్, కాల్స్‌తోనూ పర్యావరణానికి ముప్పు
టొరంటో: మెసేజ్, కాల్స్‌తో పర్యావరణానికి నష్టం ఎలాగా అని ఆలోచిస్తున్నారా..? ఈ రెండింటితోనే కాదు.. మీరు డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసే వీడియోలు, వీడియో కాల్స్, ఇంటర్నెట్ వినియోగం వీటన్నిటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే వీటిని ప్రాసెస్ చేయడానికి పెద్దఎత్తున డేటా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిరంతరాయం పనిచేస్తుంటాయి. దీంతో ఈ కేంద్రాల నుంచి భారీగా వెలువడే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2040 నాటికి పర్యావరణానికి జరిగే నాశనంలో స్మార్ట్‌ఫోన్స్, డేటా సెంటర్లదే అధిక భాగం ఉంటుందని హెచ్చరించారు. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, డెస్క్‌టాప్స్, డేటా సెంటర్లు, ఇతర కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌లో వినియోగించే కర్బన ఉద్గారాలపై వారు పరిశోధన చేపట్టారు. ప్రస్తుతం ఈ రంగం నుంచి వెలువడే కర్బన్ ఉద్గారాల శాతం 1.5 గా ఉందని.. 2040 నాటికి 14 శాతానికి చేరుకుంటుందన్నారు. -
మహిళలకూ డిజిటల్ విద్య
టాటా ట్రస్ట్‌తో కలిసి గూగుల్ శిక్షణ కోల్‌కతా: దేశంలో స్త్రీ, పురుషుల మధ్య డిజిటల్ (ఇంటర్నెట్ వినియోగం) అసమానతలను తగ్గించడానికి సెర్చ్ దిగ్గజం గూగుల్ నడుం బిగించింది. అందులో భాగంగా టాటా ట్రస్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వివక్ష ఎక్కువగా ఉందని, అక్కడి మహిళలకు ఇంటర్నెట్ను (డేటా) అందిస్తే ఈ అంతరాయం తగ్గుతుందని గూగుల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ సప్న చాద చెప్పారు. ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమం ద్వారా మహిళలకు శిక్షణనిచ్చి, ఇంటర్నెట్ ద్వారా ఎలా లాభపడొచ్చనే విషయాలను వారికి నేర్పిస్తామని సప్న చెప్పారు. ప్రభుత్వ పథకాలు, వాతావరణం, విద్య, పంటలు వంటి తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఎలా సేకరించాలో తెలియజేస్తామని పేర్కొన్నారు. దీని కోసం టాటా ట్రస్ట్ గ్రామీణ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటామని, ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారామె. -
ఆన్లైన్లో ఆక్వా సేద్యం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ డైరీలో ఎన్నెన్ని వింతలో!! ఎన్నెన్ని ఆవిష్కరణలో!! ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. దాన్ని పరిష్కరించుకోవటంతో పాటు... ఆ సమస్య ఇతరులకు రాకుండా ఒక స్టార్టప్‌ను ఆరంభించేస్తున్నారు నేటి యువత. ఆరంభించటమే కాదు... దాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి విజయగాధల్ని అందిస్తున్న ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి పలు సంస్థలు తమ విజయాల్ని వివరిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి. స్థలాభావం వల్ల కొంత ఆలస్యం జరగటం... కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురించటం వీలవుతోంది. అలాంటి స్టార్టప్స్‌లో కొన్ని ఈ వారం... వ్యవసాయమంటే మాటలు కాదు. ఇందులోనూ ఆక్వా సేద్యమంటే మరీనూ! విత్తనాల నుంచి యంత్ర పరికరాల (ఏరోటర్స్) వరకూ ప్రతి ఒక్కటీ కీలకమే. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినే సేద్యమంతా చచ్చిపోతుంది మరి. అందుకే ఆక్వా సేద్యంపై రైతులను అవగాహన కల్పించడంతో పాటుగా ఆన్లైన్లోనే విత్తనాలు, తిండిగింజలు, ఏరోటర్స్, హార్వెస్టర్స్ వంటి ఆక్వా సేద్యానికి అవసరమయ్యే ప్రతి ఒక్కదాన్ని కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది ఆక్వాఆల్. ఆక్వా సేద్యం కుటుంబం నేపథ్యమున్న అన్నదమ్ములు రామరాజు లక్కమరాజు, సూరిబాబు ఇద్దరూ కలిసి రూ.15 లక్షల పెట్టుబడితో ఈ ఏడాది మార్చిలో దీన్ని ప్రారంభించారు. ఆక్వా రైతులను, సప్లయర్స్‌ను ఒక గొడుగు కిందికి తీసుకురావటమే దీని ప్రధాన ఉద్దేశం. తమ సంస్థకు సంబంధించి రామరాజు,సూరిబాబు ఏమంటారంటే... టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉండటం వల్ల ఆక్వా సేద్యంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే రైతులకు టెక్నాలజీ వినియోగం నేర్పించడంతో పాటుగా దేశంలో లభ్యమయ్యే వివిధ రకాల ఆక్వా ఫీడ్, పంపిణీదారుల సమాచారం మొత్తాన్ని రైతులకు అందిస్తుంటాం. కాకపోతే అందరు రైతులకూ టెక్నాలజీ, ఇంటర్నెట్ వినియోగం రాకపోవచ్చు. అందుకే తమకు అవసరమైన పరికరాలు, వస్తువుల గురించి రైతులో, వారి తరఫు వారో సమాచారమందిస్తే చాలు... ఆక్వాఆల్లో రిజిస్టరై ఉన్న పంపిణీదారులకు ఎస్ఎంఎస్ రూపంలో వెళుతుంది. వెంటనే వాళ్లు స్పందించి నేరుగా రైతులతో మాట్లాడతారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
అమెజాన్ ఉచిత వైఫై జోన్లు
హైదరాబాద్‌తోసహా మూడు నగరాల్లో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినూత్న ఆలోచనతో తొలిసారిగా రంగంలోకి దిగింది. హైదరాబాద్, చెన్నై, పుణే నగరాల్లో ఉచిత వైఫై జోన్లను ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆటంకం లేకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేందుకు వీలుగా కస్టమర్ల సౌకర్యార్థం ఈ చొరవ తీసుకున్నట్టు కంపెనీ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ డెరైక్టర్ మనీష్ కల్రా వెల్లడించారు. హైదరాబాద్‌లో సికింద్రాబాద్ బస్ కూడలి, దిల్సుఖ్నగర్, అమీర్‌పేటల్లో వైఫై జోన్లు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతాల్లో వినియోగదార్లకు సహకారం అందించేందుకు కంపెనీ సిబ్బంది ఉంటారు. జూలై 14న ప్రారంభమైన ఈ సేవలు 20 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. కంపెనీ లక్ష్యం నెరవేరితే ఈ సేవలు మరి కొంతకాలం కొనసాగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. భారత్‌లో 2 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్టు గతేడాది అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌తో కంపెనీకి తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పుడు ఉచిత వైఫై జోన్లతో కస్టమర్లను ఆకట్టుకుని అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీకి వీలవుతుంది. అమెజాన్ బ్రాండ్‌కు కూడా మరింత ప్రాచుర్యం వచ్చే అవకాశం ఉంది. -
‘స్మార్ట్’ అయ్యారు
న్యూఢిల్లీ:దేశంలో ఇంటర్నెట్‌ని అధికంగా వినియోగిస్తున్నవారిలో నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఉదయం ఫ్రెండ్స్‌ని వాట్స్ అప్ అని పలకరింపుతో మొదలైన నెట్ ఉపయోగం.. ఫేస్బుక్లో ఫొటోలకు లైక్కొట్టి...ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేస్తూ.. ఊపందుకుంటుంది. ఎక్కడైనా కాస్త సమయం దొరికినా యూట్యూబ్‌లోకి వెళ్లిపోతున్నారు. సరదా ప్రోగ్రామ్‌లు... సినిమా ట్రైలర్స్ చూస్తూ గడిపేస్తున్నారు. టీవీ చానళ్లలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలను సైతం మొబైల్లోనే వీక్షిస్తున్నారు. పెళ్లి.. ప్రయాణాలు... కార్యాలయాలు.. బస్‌స్టాప్‌లు.. ఆస్పత్రులు.. సినిమా క్యూలైన్లలోనూ తలవంచుకుని ఫోన్ తెరలో మునిగిపోతున్నారు. స్క్రీన్ పైనే సెలక్షన్.. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అనేక వెబ్సైట్లు షాప్‌లలో ధరకంటే తక్కువకే వస్తువులను, దుస్తులను అందిస్తుం డడంతో సిటిజనులు చాలామంది నెట్షాపింగ్కే మొగ్గుచూపుతున్నారు.అంతేకాకుండా సమయం ఆదా అవుతుండడం కూడా దీనికి మరో ప్లస్‌పాయింట్. ఇంకేముంది కుటుంబసమేతంగా మొబైల్ ముందు కూర్చొని స్క్రీన్‌పైనే నచ్చిన దుస్తులు, వస్తువుల సెలక్షన్ పూర్తిచేస్తున్నారు. ఇంటిలో వస్తువులను అమ్మేయడానికి కూడా స్మార్ట్ఫోన్లు వినియోగించేవారి సంఖ్య పెరుగుతోంది. క్లిక్‌తోనే ఇంటికి భోజనం.. నగరంలోని కొన్ని రెస్టారెంట్లు, పిజ్జా సెంటర్లు తమ వెబ్సైట్లలో మెనూను ఉంచుతున్నాయి. చిత్రాలను చూసి నచ్చిన వాటిని క్లిక్ చేస్తే అర్ధగంటలో ఇంటికి పార్సిల్ భోజనం వచ్చేస్తోంది. బిజీగా ఉండే వ్యాపారులు తమ మొబైల్ ద్వారా మంచి డిష్‌ను ఆర్డర్ చేసి తెప్పించుకుని రుచి చూస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళన.. మొబైల్ ఇంటర్నెట్తో ఎన్నో ఉపయోగాలున్నా.. కొందరు తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్లను పట్టుకుని కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం చేసే సమయంలోనూ మొబైల్‌తోనే గడుపుతున్నారని తెలిపారు. బంధువుల మధ్యే కాదు.. కుటుంబసభ్యుల మధ్య కూడా వారికి మాట్లాడే సమయం లేకుండా పోతుందని వెళ్లగక్కారు. తగ్గిన సందడి.. మొబైల్ ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో.. కేఫ్‌ల వద్ద సందడి క్రమేణా తగ్గుతోంది. గేమ్‌లు ఆడుకునే పిల్లలు.. సర్టిఫికెట్లను స్కానింగ్ చేసుకునే విద్యార్థులు.. నెట్ఫోన్లో మాట్లాడేవారితోనే కేఫ్ నిర్వాహకులు నెట్టుకొస్తున్నారు. సంబంధాలు దెబ్బతింటున్నాయి.. ఇంటర్నెట్ లాభాల గురించి, సమయం ఆదా గురిం చే అందరూ మాట్లాడుతున్నారు కాని.. నష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని సామాజిక నిపుణులు అంటున్నారు. నెట్ మోజులో పడి మానవ సంబంధాలను మర్చిపోతున్నారు. భోజనం చేసేటప్పుటు కూడా ఓవైపు టీవీ రిమోటు.. మరోవైపు స్మార్ట్‌ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారని విమర్శిస్తున్నారు. కనీసం మంచి చెడు, సరదా కబుర్లకు కూడా ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే పరిణామమని, ఈ ధోరణిలో మార్పురావాలని సూచిస్తున్నారు. సమాచార సేకరణ: అన్విత, డిగ్రీ విద్యార్థిని ఇప్పుడంటే స్మార్ట్ఫోన్ల విప్లవంతో కేఫ్‌లకు వెళ్లడం లేదు కాని ఏడాది క్రితం వరకు కేఫ్‌లు దేవుడిచ్చిన వరంలా కనిపించేవి. కాస్త ఖాళీ దొరికినా కేఫ్‌లో దూరిపోయి పోటీ పరీక్షలకు సంబంధించి సమాచారం సేకరించేదాన్ని. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ద్యారా నే ఇంటర్నెట్ వాడుతున్నాను. చాటింగ్, ఫేస్బుక్ మాత్రమే కాకుండా పలు కాలేజీలు, యూనివర్సిటీల కు సంబంధించిన సమాచార సేకరణ, కొత్త సిని మాలు, కొత్త పాటలు, రాజకీయాలు, పోటీపరీక్షల గురించి నెట్ ద్వారానే తెలుసుకుంటున్నాను.