న్యూఢిల్లీ : ప్రపంచమే ఇంటర్నెట్ మయంగా మారిపోయిన కాలం.. మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ గణనీయంగా వ్యాప్తి చెందుతున్న రోజులివి. కానీ భారత్‌లో ఇంటర్నెట్ వాడకంపై మాత్రం సంచలన విషయాలే వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యలో వయసున్న వారిలో కేవలం 19 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారట. ఈ వయసున్న వారిలో 35 శాతం మందే ఇంటర్నెట్ తెలిసిన వారు ఉంటున్నారని తాజా రిపోర్టు నివేదించింది. ‘ఆఫ్టర్‌యాక్సస్ : ఐసీటీ యాక్సస్ అండ్ యూజ్ ఇన్ ఇండియా అండ్ ది గ్లోబల్ సౌత్’ పేరుతో లిర్న్‌ఆసియా, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రిపోర్టును ప్రచురించింది. భారత్‌లో ఇంటర్నెట్ వాడకం ఎంత తక్కువగా ఉందో తెలుపుతూ ఈ రిపోర్టును నివేదించింది.
భారత్‌లో ఇంటర్నెట్ గురించి అవగాహన లేకపోవడమే అతిపెద్ద సమస్య అని ఈ రిపోర్టు పేర్కొంది. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కేవలం 35 శాతం మందికే ఇంటర్నెట్ ఏమిటన్నది అవగాహన ఉందని, అత్యంత తక్కువగా 19 శాతం మంది మాత్రమే దీన్ని వాడుతున్నారని రిపోర్టు నివేదించింది. ప్రపంచంలో అత్యంత అఫార్డబుల్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని లెర్న్‌ఆసియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెర్న్‌ఆసియా హిలాని గల్పాయా చెప్పారు. కానీ ఇంటర్నెట్ వాడకం ఇంకా తక్కువగానే ఉందన్నారు. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యనున్న మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 27 శాతం మంది మాత్రమే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment