ఫుల్లుగా తాగి ఎస్సై చెంప వాయించింది | Drunk woman slaps cop in Mumbai police station | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా తాగి ఎస్సై చెంప వాయించింది

Published Tue, Jun 28 2016 10:57 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

ఫుల్లుగా తాగి ఎస్సై చెంప వాయించింది - Sakshi

ఫుల్లుగా తాగి ఎస్సై చెంప వాయించింది

ముంబయి: ఇప్పుడొక వీడియో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ యువతి విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ఘటన ఈ నెల (జూన్)15న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోలో చూపిన ప్రకారం మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఓ యువతి నేరుగా వెళ్లి ఓ పోలీసుతో వాదనలు పడటమే కాకుండా అసభ్యంగా తిడుతూ కుర్చీలో ఉన్న అతడిపై పదేపదే చేయిచేసుకుంది. దీంతో ఆ యువతి పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? వారి మధ్యలో జరగుతున్న సంభాషణ ఏమిటీ? ఆ యువతి ఎందుకలా ఎస్సైని కొట్టింది? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement