సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిద్దిపేట పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 700 మంది ఈ మేళాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన 22 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిబంధనల మేరకు ఇంటర్వూలు నిర్వహించారు.
జిల్లాకు చెందిన ఆరు ప్రభుత్వ శాఖల పర్యవేక్షణలో ఈ మేళా జరిగింది. ఆరోతరగతి నుంచి డిగ్రీ వరకు విద్యనభ్యసించిన వారికి విద్యార్హతను బట్టి ఆయా కంపెనీలు ఇంటర్వూలు నిర్వహించాయి. ఇందులో సుమారు 300 మంది ఎంపికయ్యారు. ఈ మేళాను జిల్లా ఉపాధి కల్పన అధికారి రజనిప్రియ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి, జేకేసీ కోఆర్డినేటర్ అయోధ్యరెడ్డి, డీఆర్‌డీఏ, ఐకేపీ, మెప్మా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అరబిందోలో ఇంటర్వ్యూలు
జిన్నారం: అరబిందో పరిశ్రమలో ఉద్యోగాల కోసం నేరుగా ఇంటర్యూలకు హాజరయ్యే కార్యక్రమాన్ని చేపడుతున్నామని జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాల్‌రెడ్డి, బొల్లారం సర్పంచ్ రోజారాణి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీసీ, బైపీసీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అరబిందో పరిశ్రమ నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఈ నెల 16న మండలంలోని బొల్లారంలోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 6 నుంచి 9గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. అర్హత కలిగినవారు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని వారు కోరారు.
జాబ్‌మేళాకు విశేష స్పందన
Published Thu, Feb 13 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement
Advertisement