ramanachari
-
సిద్దిపేట బల్దియాకు లీడర్షిప్ అవార్డు
సిద్దిపేటజోన్: వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నెట్వర్క్ కలిగి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎర్త్ డే ఆర్గనైజేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ లీడర్షిప్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క సిద్దిపేటకే ఈ అవార్డు రావడం విశేషం. సిద్దిపేటతో పాటు కోయంబత్తూరు, భువనేశ్వర్, చండీగఢ్, వాడి, జమ్మూ, రాజ్‌కోట్, బెంగళూరు తదితర పట్టణాలకు సైతం ఈ పురస్కారం లభించింది. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. -
రూ.20 కోట్లతో విదేశీ విద్యాపథకం
సాక్షి,హైదరాబాద్: వివేకానంద విదేశీ పథకం కింద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ బ్రాహ్మణ సం క్షేమ పరిషత్ రూ.20 కోట్లను కేటాయించింది. పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేవీ రమణాచారి అధ్యక్షతన గురువారం జరిగిన ఈ సంఘం సర్వసభ్య సమావేశం పలు కీలక తీర్మానాలు చేసింది. రాష్ట్రంలో రూ.10 కోట్లతో బ్రాహ్మణ భవనాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.5 లక్షలు మించకుండా రాయితీ కల్పిస్తూ 1,900 మంది లబ్ధిదారులకు రూ.36 కో ట్లను కేటాయించింది. అర్హులైన వారికి ఈ నెలాఖరులోగా రాయితీని చెక్కుల రూపంలో అందజేయాలని తీర్మానించింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు 30న ఉద్యోగమేళా నిర్వహించాలని నిర్ణయించింది. -
మున్సిపల్ సిబ్బందికి వాకీటాకీలు
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: సిద్దిపేట మున్సిపల్ పరిధిలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి కమిషనర్ స్థాయి అధికారి వరకు సమాచారం సమన్వయానికి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రధాన విభాగాలకు చెందిన సిబ్బందికి మున్సిపల్ అధికారులు వాకీటాకీలను అందించారు. వీటిని సమన్వయ పరిచేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం మున్సిపల్ సిబ్బందికి వాకీటాకీల వినియోగం, వాటి ఉద్దేశం గూర్చి అవగాహన కల్పించారు. సిద్దిపేట పట్టణంలో సుమారు లక్ష జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సేవలను సత్వరం అందించేందుకు కమిషనర్ రమణాచారి 31 వాకీటాకీలను సిబ్బందికి పంపిణీ చేశారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పన్నుల వసూలు, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, పరిపాలన విభాగంతో పాటు వీధి దీపాలు లాంటి ముఖ్య విభాగాలు అధికారులకు వీటిని అందించనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలు, పారిశుద్ధ్య సమస్యలు, నీటి సరఫరాలో ఎదురయ్యే అవాంతరాలను ఎప్పటికప్పుడు మెరుగు పర్చుకునేందుకు వీటిని వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కొన్ని విభాగాలకు చెందిన సిబ్బందికి వీటి వినియోగం గూరించి వివరిస్తూ అవగాహన కల్పించారు. -
జాబ్‌మేళాకు విశేష స్పందన
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిద్దిపేట పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 700 మంది ఈ మేళాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన 22 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిబంధనల మేరకు ఇంటర్వూలు నిర్వహించారు. జిల్లాకు చెందిన ఆరు ప్రభుత్వ శాఖల పర్యవేక్షణలో ఈ మేళా జరిగింది. ఆరోతరగతి నుంచి డిగ్రీ వరకు విద్యనభ్యసించిన వారికి విద్యార్హతను బట్టి ఆయా కంపెనీలు ఇంటర్వూలు నిర్వహించాయి. ఇందులో సుమారు 300 మంది ఎంపికయ్యారు. ఈ మేళాను జిల్లా ఉపాధి కల్పన అధికారి రజనిప్రియ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి, జేకేసీ కోఆర్డినేటర్ అయోధ్యరెడ్డి, డీఆర్డీఏ, ఐకేపీ, మెప్మా శాఖల అధికారులు పాల్గొన్నారు. అరబిందోలో ఇంటర్వ్యూలు జిన్నారం: అరబిందో పరిశ్రమలో ఉద్యోగాల కోసం నేరుగా ఇంటర్యూలకు హాజరయ్యే కార్యక్రమాన్ని చేపడుతున్నామని జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాల్‌రెడ్డి, బొల్లారం సర్పంచ్ రోజారాణి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీసీ, బైపీసీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అరబిందో పరిశ్రమ నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఈ నెల 16న మండలంలోని బొల్లారంలోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 6 నుంచి 9గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. అర్హత కలిగినవారు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని వారు కోరారు.