రేపు జాబ్ మేళా
Published Wed, Aug 10 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
మర్రిపాలెం : శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా జరుపుతామని జిల్లా ఉపాధి అధికారి(టెక్నికల్) సిహెచ్.సుబ్బిరెడ్డి తెలియజేశారు. గ్రామ్‌తరంగ్ ఎంప్లాయిబిలిటీ, ఐటీసీ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి కలిగి 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసు గల పురుష అభ్యర్థులు జాబ్‌మేళాకు అర్హులన్నారు. ఖాళీలు 40 ఉన్నాయన్నారు. శిక్షణ కాలం 55 రోజులని, ఆ కాలంలో ప్రభుత్వం నిర్దేశించిన సై్టఫండ్ అభ్యర్థికి చెల్లిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ఐటీసీ కంపెనీ ఎఫ్.ఎం.జి.సి విభాగంలో సేల్స్‌మన్ ఉద్యోగంలో ప్రవేశం కల్పిస్తారని వివరించారు. కంపెనీ నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వరకు జీతం చెల్లిస్తుందన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సెంచూరియన్ యూనివర్సిటీ మంజూరు చేసిన సర్టిఫికేట్ ప్రదానం చేస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పాత ఐటీఐ జంక్షన్ ప్రాంతంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నేరుగా హాజరు కావాలని తెలిపారు.
Advertisement