candidates selection
-
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఎన్టీఆర్, సాక్షి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. బుధవారం ఉదయం ఆశావహులు అప్లికేషన్లను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు అందించారు. మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ సమర్పించగా.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ సమర్పించే అవకాశం ఉందని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. ‘‘ఏపీలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. మాజీలంతా నిజమైన కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పోటీ చేసే స్ధానంపై త్వరలోనే స్పష్టత వస్తుందని అని అన్నారాయన. -
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఆలస్యం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జాబితా ఆలస్యం అయ్యే అవకాశాకాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు.. స్క్రీనింగ్ కమిటీ 6వ తేదీదాకా హైదరాబాద్‌లోనే ఉండడం, అలాగే పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌తో భేటీ కావాల్సి ఉండడమేనని తెలుస్తోంది. ఇవాళ స్క్రీనింగ్ కమిటీ ముందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదిక చేరనుంది. గాంధీభవన్‌లో ఉదయం 11 నుంచి పీఈసీ సభ్యులతో వ్యక్తిగతంగా సమావేశం కానుంది స్క్రీనింగ్ కమిటీ. సాయంత్రం వరకు రెండు సెషన్స్‌లో ఈ వన్ టు వన్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రదేశ్‌ఎన్నికల కమిటీ సభ్యులు నిన్నంతా గాంధీభవన్‌లో తమ తమ అభిప్రాయాలతో అభ్యర్థుల పేర్లతో నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లకు ముందు టిక్‌ను ఉంచారు వాళ్లంతా. దీంతో.. ఇవాళ పీఈసీ సభ్యులతో సమావేశమై.. ఆ సీల్డ్ కవర్‌ను పరిశీలిస్తుంది. వాళ్ల నుంచి ఆయా అభ్యర్థుల ఎంపికకు గల కారణాలను అడిగి తెలుసుకుంటుంది స్క్రీనింగ్‌కమిటీ. ఇక రేపు(మంగళవారం) గాంధీ భవన్‌లోనే.. రేపు పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుంది. పీఈసీ,ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేస్తుంది. చివరకు.. 7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే.. ఏడవ తేదీన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌తో స్క్రీనింగ్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరికొన్ని రోజులు ముందుకు పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. దీంతో.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక చేరినా పరిశీలనకు కొంత సమయం పట్టొచ్చు. అంటే.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తర్వాతే.. కాంగ్రెస్ తరపున అభ్యర్థుల జాబితా ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
రేపు జాబ్ మేళా
మర్రిపాలెం : శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా జరుపుతామని జిల్లా ఉపాధి అధికారి(టెక్నికల్) సిహెచ్.సుబ్బిరెడ్డి తెలియజేశారు. గ్రామ్‌తరంగ్ ఎంప్లాయిబిలిటీ, ఐటీసీ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి కలిగి 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసు గల పురుష అభ్యర్థులు జాబ్‌మేళాకు అర్హులన్నారు. ఖాళీలు 40 ఉన్నాయన్నారు. శిక్షణ కాలం 55 రోజులని, ఆ కాలంలో ప్రభుత్వం నిర్దేశించిన సై్టఫండ్ అభ్యర్థికి చెల్లిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ఐటీసీ కంపెనీ ఎఫ్.ఎం.జి.సి విభాగంలో సేల్స్‌మన్ ఉద్యోగంలో ప్రవేశం కల్పిస్తారని వివరించారు. కంపెనీ నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వరకు జీతం చెల్లిస్తుందన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంచూరియన్ యూనివర్సిటీ మంజూరు చేసిన సర్టిఫికేట్ ప్రదానం చేస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పాత ఐటీఐ జంక్షన్ ప్రాంతంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. -
కారు.. తకరారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఒంటరిగా బరిలో దిగాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ వారంలో తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఆ పార్టీ.. మొదటి విడతలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల చేరికతో మంచి ఊపు మీదున్న గులాబీ దండు జిల్లాలో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆక ర్షించడం ద్వారా సాధారణ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను నమోదు చేయాలని భావి స్తోంది. పరిగి, తాండూరు, చేవెళ్ల ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో బలీయంగా త యారవుతోంది. దక్షిణ తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించునేలా వ్యూహ రచన చేస్తున్న టీఆర్ఎస్.. వలసలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా జిల్లాలో బలంగా ఉన్న టీడీపీని దారుణంగా దెబ్బతీసింది. ఇదే దూకుడును ప్రదర్శించేందుకు మరికొందరు కాంగ్రెస్ నాయకులపై కన్నేసింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్న గులాబీ దళం.. వారం రోజుల్లోగా ఈ చేరికలను కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా కుత్బుల్లాపూర్, మేడ్చల్, మహేశ్వరం అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నందున.. వీటిపై ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోవద్దని నిర్ణయించింది. ఎల్బీనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డిని బరిలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే, వయోభారం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయన విముఖత చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు కారెక్కేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక్కడ అభ్యర్థుల జాబితా మారే అవకాశం లేకపోలేదు. వికారాబాద్ నుంచి విద్యార్థి నేత పిడమర్తి రవిని బరిలోకి దింపాలని భావిస్తున్నప్పటికీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆనంద్ వ్యవహరిస్తున్నారు. తాజాగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సంజీవరావు కూడా పార్టీలో చేరారు. వీరివురినీ కాదని స్థానికేతరుడికి సీటిస్తే ఒప్పుకొనేది లేదని స్థానిక నాయకత్వం హెచ్చరిస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైనా... మల్కాజిగిరి విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.