అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జాబితా ఆలస్యం అయ్యే అవకాశాకాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు.. స్క్రీనింగ్ కమిటీ 6వ తేదీదాకా హైదరాబాద్‌లోనే ఉండడం, అలాగే పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌తో భేటీ కావాల్సి ఉండడమేనని తెలుస్తోంది.
ఇవాళ స్క్రీనింగ్ కమిటీ ముందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదిక చేరనుంది. గాంధీభవన్‌లో ఉదయం 11 నుంచి పీఈసీ సభ్యులతో వ్యక్తిగతంగా సమావేశం కానుంది స్క్రీనింగ్ కమిటీ. సాయంత్రం వరకు రెండు సెషన్స్‌లో ఈ వన్ టు వన్ సమావేశాలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రదేశ్‌ఎన్నికల కమిటీ సభ్యులు నిన్నంతా గాంధీభవన్‌లో తమ తమ అభిప్రాయాలతో అభ్యర్థుల పేర్లతో నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లకు ముందు టిక్‌ను ఉంచారు వాళ్లంతా. దీంతో.. ఇవాళ పీఈసీ సభ్యులతో సమావేశమై.. ఆ సీల్డ్ కవర్‌ను పరిశీలిస్తుంది. వాళ్ల నుంచి ఆయా అభ్యర్థుల ఎంపికకు గల కారణాలను అడిగి తెలుసుకుంటుంది స్క్రీనింగ్‌కమిటీ.
ఇక రేపు(మంగళవారం) గాంధీ భవన్‌లోనే.. రేపు పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుంది. పీఈసీ,ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేస్తుంది. చివరకు.. 7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక సమర్పించాల్సి ఉంది.
అయితే.. ఏడవ తేదీన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌తో స్క్రీనింగ్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరికొన్ని రోజులు ముందుకు పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. దీంతో.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక చేరినా పరిశీలనకు కొంత సమయం పట్టొచ్చు. అంటే.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తర్వాతే.. కాంగ్రెస్ తరపున అభ్యర్థుల జాబితా ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment