అనంతపురం ఎడ్యుకేషన్ : చెన్నైకు చెందిన బాట్లిబాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఈనెల 23న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎ.కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ (ఈఈఈ), డిప్లొమా ఎలక్ట్రికల్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులన్నారు. 25–35 ఏళ్లలోపు పురుఫులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నాయని, జీతం నెలకు రూ. 15 వేలు ఉంటందని, ఎంపికైన వారు అనంతపురం జిల్లాలోనే పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఆసక్తిగల అభ్యర్థులు 23న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ప్రభుత్వ బాలికల ఐటీఐలో జరిగే జాబ్‌మేళాకు బయోడేటాతో పాటు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 88868 82092 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
23న జాబ్‌మేళా
Published Tue, Sep 20 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
Advertisement
Advertisement