
జాబ్‌మేళాకు విశేష స్పందన
తుళ్ళూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరులో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటైన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో పలు నియామకాలకు నిర్వహించిన జాబ్‌మేళాకు 238 మంది యువతీయువకులు హాజరయ్యారు. వీరిలో146 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఓడీపీఎస్‌ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో 26 మంది, నవత ట్రాన్స్‌పోర్టులో 21మంది, ఏజీస్ గ్లోబల్ సర్వీసెస్‌లో 45 మంది, ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్‌ఆఫీసర్లుగా 46 మంది ఎంపిక య్యారు. ఇతర విభాగాలలో శిక్షణ నిమిత్తం మరో 92 మందిని ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాబ్స్ సిటీ మేనేజర్ షేక్‌మీరావలి చెప్పారు. కార్యక్రమంలో సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రహంతుల్లా, సోషల్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ జయదీప్, క్యాంపస్ అడ్మిన్ అధికారి అజయ్‌చౌదరి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.