ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 27న బెల్లంపల్లిలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని క్యాపస్టన్ సంస్థలో భద్రత సిబ్బంది పోస్టు కోసం ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
గిరిజన ప్రాంత యువకులు బెల్లంపల్లి హెడ్‌క్వార్టర్స్‌లో ఉదయం 8 గంటలకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన యువకులు 165 సెంటిమీటర్ల ఎత్తు, 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు, 50 కేజీల బరువు కలిగి ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మేడ్చల్‌లో నెల రోజులు శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం నెలకు రూ.7000 వేతనంతోపాటు, వసతి కల్పించన్నుట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రేషన్‌కార్డు, విద్యార్హత పత్రాల జిరాక్స్, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు వెంట తేవాలని సూచించారు.
వివరాలకు పోలీసు కంట్రోల్ రూం నంబర్ 9440795079లో సంప్రదించాలని పేర్కొన్నారు. గతంలో పోలీసుస్టేషన్లలో దరఖాస్తు చేసుకున్న వారు సైతం హాజరుకావాలని సూచించారు. యువకులు ఉద్యోగంలో స్థిరపడేలా జిల్లా పోలీసులు, ఎస్సైలు, డీఎస్పీలు ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.
27న బెల్లంపల్లిలో ఉద్యోగ మేళా
Published Thu, Nov 21 2013 3:59 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement