ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రదామాల నివారణ అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ గజరావుభూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శనివారం ఆర్టీసీ రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించా రు. దీనికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాన్ని నడిపితే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ అనే నినాదాన్ని నిజం చేస్తూ ముందుకు సాగాలని డ్రైవర్లకు సూచించారు.
ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ, వాహనదారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీటీఎం సరిరాం నాయక్, ఆదిలాబాద్ డిపో మేనేజర్ శివకేశవయాదవ్, అసిస్టెంట్ డిపో మేనేజర్ జాకుబ్, టీఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమేశ్, ఈయూ రీజినల్ కార్యదర్శి వెంకటయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకుడు రాంచందర్, రీజినల్ కార్యదర్శి సత్యనారాయణ, టీఎంయూ రీజినల్ కార్యదర్శి బిడి.చారి, నాయకులు ఉస్సేన్, యూసూఫ్, లింగయ్య పాల్గొన్నారు.
రీజినల్ స్థాయిలో ఉత్తమ డ్రైవర్లు
రీజినల్ స్థాయిలో ఉత్తమ డ్రైవర్లుగా నిలిచిన ముగ్గురుని అవార్డులు, నగదును అందజేశారు. ప్రథమ బహుమతి 29 ఏళ్ల 2 నెలల అనుభవంలో ప్రమాదాలు చేయని భైంసా డిపో డ్రైవర్ ఎండీ షఫీని సత్కరించి రూ.3,250ల నగదు అందజేశారు. నిర్మల్ డిపోకు చెందిన ఎస్‌కే జహీర్ అహ్మద్‌కు ద్వితీయ బహుమతిగా రూ.3,000, ఆసిఫాబాద్‌కు చెందిన ఈ.ప్రసాద్‌కు తృతీయ బహుమతిగా రూ.2,750 నగదు పంపిణీ చేశారు.
డిపోల పరిధిలో ప్రథమ బహుమతిని అందుకున్న డ్రైవర్లకు రూ.2,000, ద్వితీయ బహుమతి రూ.1,750, తృతీయ బహుమతిగా రూ.1,500 నగదు అందజేశారు.
డిపోల వారీగా ఉత్తమ డ్రైవర్లుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్న వారు వరుసగా... :
ఆదిలాబాద్ : గణపతి, హిదియత్ అలీ, ఎండీఆరీఫొద్దీన్
ఆసిఫాబాద్ : ఎంకే గౌడ్, జి.దేవిదాస్, వి.శివరాం
భైంసా : లతీఫ్, ముక్తార్, వైఎస్.ఖాన్
మంచిర్యాల : ఇక్బార్ హైమద్, అమీర్‌ఖాన్, జబ్బర్
నిర్మల్ : సర్వర్‌ఖాన్, వాజీబ్, రాజన్న
ఉట్నూర్ : గంగారాం, కొమురయ్య, ఎస్.ఎం.రావు
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
Published Sun, Jan 26 2014 3:32 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement