Prevention of road accidents
-
ప్రజల్లో అవగాహన పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వెంట నే వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన అయిదో రోడ్డు భద్రత మండలి సమావేశంలో ఆయన వివిధ విభాగాల అధికారులు, లారీ డ్రైవర్ల సంఘం, ఆటో యూనియన్ నేతలతో సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారి సూచనలు స్వీకరించారు. వాటిలో అమలు చేయాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులను ఏ బీ సీ కేటగిరీలుగా విభజించినట్టు వెల్లడించారు. పీపీపీ పద్ధతి అమలులో ఉన్న రహదారులపై ప్రతి 20 కిలోమీటర్లకు ఓ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా పెట్రోలింగ్ వాహనాలు కూడా పెంచుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తిస్తున్నామని, వాటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. నార్కెట్‌పల్లి, అద్దంకి ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని లారీ ఓనర్ల సంఘం మంత్రి దృష్టికి తెచ్చింది. రోడ్డు భద్రతపై లారీలు, ఆటోలు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. హెల్మెట్లు, సీట్బెల్ట్లపై ఎంత ప్రచారం చేసినా వాహనదారుల్లో నిర్లక్ష్యం పోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే 40 వేల లైసెన్సులను రద్దు చేసి వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని మంత్రి చెప్పారు. చలాన్లు విధిస్తున్నా మార్పు రావటం లేదన్నారు. ఇక ముందు నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వ కార్యక్రమమనే అపోహ నుంచి జనం బయటకు వచ్చి, తాము కూడా నిబంధనలు పాటించాలనే అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. నగరంలో పాదచారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు చేపడతామన్నారు. -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో రహదారులు-భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. కరీంనగర్ నుంచి ఖమ్మం రోడ్డుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే నగరంలోకి భారీ వాహనాలు రాకుండా ఉంటాయని, ఇం దుకోసం పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. పార్కింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, నగరంలో పెయిడ్ పార్కింగ్ స్థలాలు పరిశీలించాలని తెలిపారు. కాజీపేట నుంచి ఎంజీఎం వరకు బైక్‌లు, ఆటోలకు వేరువేరుగా లేన్లు ఏర్పాటు చేసి ప్ర యోగాత్మకంగా నడిపి ఫలితాలు గమనించాలని పే ర్కొన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడు తూ బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతులు ఇచ్చే ముందు పోలీస్ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని, భద్రతా చర్యలు పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. అనుమతులు ఇచ్చే వారికి భద్రతా చర్యల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. రూరల్ ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రోడ్లవల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. డివైడర్లున్న చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మునిసిపల్ కమిషనర్ పండాదాస్, డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, విద్యుత్, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రదామాల నివారణ అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ గజరావుభూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శనివారం ఆర్టీసీ రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించా రు. దీనికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాన్ని నడిపితే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ అనే నినాదాన్ని నిజం చేస్తూ ముందుకు సాగాలని డ్రైవర్లకు సూచించారు. ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ, వాహనదారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీటీఎం సరిరాం నాయక్, ఆదిలాబాద్ డిపో మేనేజర్ శివకేశవయాదవ్, అసిస్టెంట్ డిపో మేనేజర్ జాకుబ్, టీఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమేశ్, ఈయూ రీజినల్ కార్యదర్శి వెంకటయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకుడు రాంచందర్, రీజినల్ కార్యదర్శి సత్యనారాయణ, టీఎంయూ రీజినల్ కార్యదర్శి బిడి.చారి, నాయకులు ఉస్సేన్, యూసూఫ్, లింగయ్య పాల్గొన్నారు. రీజినల్ స్థాయిలో ఉత్తమ డ్రైవర్లు రీజినల్ స్థాయిలో ఉత్తమ డ్రైవర్లుగా నిలిచిన ముగ్గురుని అవార్డులు, నగదును అందజేశారు. ప్రథమ బహుమతి 29 ఏళ్ల 2 నెలల అనుభవంలో ప్రమాదాలు చేయని భైంసా డిపో డ్రైవర్ ఎండీ షఫీని సత్కరించి రూ.3,250ల నగదు అందజేశారు. నిర్మల్ డిపోకు చెందిన ఎస్కే జహీర్ అహ్మద్‌కు ద్వితీయ బహుమతిగా రూ.3,000, ఆసిఫాబాద్‌కు చెందిన ఈ.ప్రసాద్‌కు తృతీయ బహుమతిగా రూ.2,750 నగదు పంపిణీ చేశారు. డిపోల పరిధిలో ప్రథమ బహుమతిని అందుకున్న డ్రైవర్లకు రూ.2,000, ద్వితీయ బహుమతి రూ.1,750, తృతీయ బహుమతిగా రూ.1,500 నగదు అందజేశారు. డిపోల వారీగా ఉత్తమ డ్రైవర్లుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్న వారు వరుసగా... : ఆదిలాబాద్ : గణపతి, హిదియత్ అలీ, ఎండీఆరీఫొద్దీన్ ఆసిఫాబాద్ : ఎంకే గౌడ్, జి.దేవిదాస్, వి.శివరాం భైంసా : లతీఫ్, ముక్తార్, వైఎస్.ఖాన్ మంచిర్యాల : ఇక్బార్ హైమద్, అమీర్‌ఖాన్, జబ్బర్ నిర్మల్ : సర్వర్‌ఖాన్, వాజీబ్, రాజన్న ఉట్నూర్ : గంగారాం, కొమురయ్య, ఎస్.ఎం.రావు