హన్మకొండ అర్బన్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో రహదారులు-భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. కరీంనగర్ నుంచి ఖమ్మం రోడ్డుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే నగరంలోకి భారీ వాహనాలు రాకుండా ఉంటాయని, ఇం దుకోసం పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.
పార్కింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, నగరంలో పెయిడ్ పార్కింగ్ స్థలాలు పరిశీలించాలని తెలిపారు. కాజీపేట నుంచి ఎంజీఎం వరకు బైక్‌లు, ఆటోలకు వేరువేరుగా లేన్లు ఏర్పాటు చేసి ప్ర యోగాత్మకంగా నడిపి ఫలితాలు గమనించాలని పే ర్కొన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడు తూ బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతులు ఇచ్చే ముందు పోలీస్ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని, భద్రతా చర్యలు పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. అనుమతులు ఇచ్చే వారికి భద్రతా చర్యల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. రూరల్ ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రోడ్లవల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. డివైడర్లున్న చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మునిసిపల్ కమిషనర్ పండాదాస్, డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, విద్యుత్, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
Published Wed, Sep 3 2014 3:19 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
Advertisement