gajarao bhupal
-
రౌడీషీటర్లలో మార్పునకు కౌన్సెలింగ్
సాక్షి, తిరుపతి : ‘‘నేరాల నియంత్రణకు నిరంతరం నిఘా ఉంచుతాం..తిరుమల–తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. పంచాయితీలు చేసే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తాం..అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదు..’’ అని అర్బన్Œ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ స్పష్టం చేశారు. తిరుపతితో పాటు తిరుమల భద్రత, ట్రాఫిక్, భూకబ్జాలు, ఎరచ్రందనం అక్రమ రవాణా అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే ... సాక్షి : తిరుమల, తిరుపతిలో నిఘాను ఎలా బలోపేతం చేస్తారు? ఎస్పీ : తిరుమల, తిరుపతిలో నిరంతరం నిఘా పటిష్టంగా ఉంచుతాం. ఇప్పటికే నగరంతోపాటు తిరుమలలో సీసీ కెమెరాల నిఘా ఉంది. నిరంతరం బ్లూకోల్ట్స్ రక్షక బృందాలు పట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. రాత్రి పూట అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచుతున్నాం. మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశాం. సాక్షి :భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ : శ్రీవారి భక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తాం. ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, అలిపిరి, శ్రీనివాసం, విష్ణునివాసం వంటి వసతి గృహాలు, నగరంలోని చారిత్రాత్మక ఆలయాల వద్ద నిరంతరం పోలీసుల నిఘాతో పాటు పట్రోలింగ్ ఉంటుంది. సాక్షి :పెరిగిపోతున్న దొంగతనాలకు ఎలా అడ్డుకట్ట వేస్తారు? ఎస్పీ : గతంలో కంటే దొంగతనాలు బాగా తగ్గాయి. దొంగలపై నిరంతరం నిఘా ఉంచి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తాం. ప్రజలు కూడా మాకు సహకరించాలి. ప్రతి ఇంటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. సాక్షి :తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది.. ఎస్పీ : ట్రాఫిక్ నియంత్రణకు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. జనవరి ఒకటి నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అంతవరకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. సాక్షి : ఈ– చలానాలు సక్రమంగా కడుతున్నారా..? ఎస్పీ : నగరంలో ఇప్పటి వరకు రూ.1,37,229 చలానాలు నమోదు చేశాం. ఇందులో 45,922 వసూలయ్యాయి. మిగిలినవన్నీ ఇప్పటి వరకు వసూలు కాలేదు. వాటిపై దృష్టి సారిస్తున్నాం. ఇందులో పది కన్నా ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలు 51 ఉన్నట్టు గుర్తించాం. ఇందులో 22 వాహనాలు పూర్తిస్థాయిలో చలానాలు చెల్లించాయి. మరో 29 వాహనాలు చెల్లించాల్సి ఉంది. వీరు ఈనెల 25వ తేదీలోపు చెల్లించాలి. లేనిపక్షంలో వారి ఇంటికి వెళ్లి వాహనాలు సీజ్ చేస్తాం. సాక్షి : రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి? ఎస్పీ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. హైవేలలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేస్తాం. సాక్షి : ఎరచ్రందనం స్మగ్లర్లను ఎలా కట్టడి చేస్తారు? ఎస్పీ : ఇప్పటికే అర్బ¯న్ జిల్లాలో ఎరచ్రందనం అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిని మరింత పటిష్టం చేసి, స్మగ్లర్లను కట్టడి చేస్తాం. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. వారు పరివర్తన చెందేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అలాగే వీరి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతాం. సాక్షి : మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు? ఎస్పీ :కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాలలో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ జరగకుండా విద్యార్థులకు అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. నిరంతర మహిళా రక్షకులతో ఆకతాయిల భరతం పడతాం. సాక్షి : తిరుపతిలో భూ వివాదాల మాటేమిటి? ఎస్పీ : భూ వివాదాలకు కారకులైన వారిని గుర్తించడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. ఇప్పటికే కార్యాచరణ రూపొందించాం. ఫోర్జరీ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. -
శాంతిభద్రతలు కాపాడుతా..
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఘర్షణలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెడతామని, శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామని ఎస్పీ తరుణ్‌జోషి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన ఈయన ఇటీవలే ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. సోమవారం తరుణ్‌జోషి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న గజరావు భూపా ల్ పుష్పగుచ్చం అందజేసి కొత్త ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. జిల్లాలో అల్లర్లు సృష్టిం చే వారిపై ప్రత్యేక నిఘా పెడుతామన్నారు. మావోయిస్టుల ప్రబల్యం తగ్గించేందు కు, మతఘర్షణలను నివారించేందుకు అంతర్రాష్ట్ర కార్యకలాపాలపై ప్ర త్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు వ్యవస్థకు ప్రజల సహకారం తప్పనిసరని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించడంలో పోలీసు శాఖ కీలక ప్రాత పోషించేలా చూస్తానన్నారు. త్వర లో జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను సందర్శించి పరిస్థితులు తెలుసుకుంటానని వివరించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న గజరావు భూపాల్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో పనిచేయడం గొప్పగా భా విస్తున్నానని పేర్కొన్నారు. జిల్లా భౌగోళికంగా పెద్ద ది కావడంతో ఎవైనా అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు సమయానికి వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నా రు. ఇక్కడి ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ఒకేసారి నాలుగు ఎన్నికలు వచ్చినా సమర్థవంతం గా నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎస్పీ తరుణ్ జోషికి పోలీసు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జగన్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. -
సీఎం పర్యటన బందోబస్తు సంఖ్య
ఆదిలాబాద్ క్రైం : కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొనేందుకు ఈనెల 8న జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రశేర్‌రావు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భీమ్ స్వస్థలమైన కెరమెరి మండలం జోడేఘాట్‌లో వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సోమవారం జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ గజరావు భూపాల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బందోబస్తు వివరాలు తెలుసుకున్నారు. జిల్లాకు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసు అధికారుల పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా భద్రతా లోపం లేకుండా జోడేఘాట్‌లో అణువణువు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ జోన్ ఐజీ రవిగుప్తా, కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. -
మావోయిస్టుల లొంగుబాటు పర్వం ...
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. రెండు వారాల క్రితమే మావోయిస్టు దంపతులు లొంగిపోగా.. శుక్రవారం మరో ఇద్దరు మావోయిస్టు దంపతులు ఆడే ప్రభు, తలాండి కాంత ఎస్పీ గజరావు భూపాల్ ఎదుట లొంగిపోయారు. ఒకవైపు మావోలకు, పోలీసులకు ఎన్కౌంటర్లు జరుగుతుండగా.. మరోవైపు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం మావోయిస్టుల ఉనికిని దెబ్బతీస్తోంది. శుక్రవారం లొంగిపోయిన మావోయిస్టు దంపతుల వివరాలు ఎస్పీ భూపాల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆడే ప్రభు ఊరఫ్ చంద్రం, సతీష్. స్వస్థలం నేరడిగొండ మండలం కుంటాల గ్రామం. 1984లో అప్పటి ఖానాపూర్ దళ కమాండర్ రమేశ్ నిర్వహించిన గ్రామసభల్లో విప్లవ గీతాలకు ఆకర్షితుడై దళంలో చేరాడు. అప్పటి నుంచి ఐదు నెలలు సభ్యునిగా కొనసాగిన అనంతరం మంగి దళకమాండర్ జగదీశ్ ఆధ్వర్యంలో 1986 వరకు సభ్యునిగా కొనసాగాడు. తర్వాత బదిలీపై మహారాష్ర్టలోని గడ్చిరోలి జిల్లా బాంగ్రామాడ్ ఏరియాలో సభ్యునిగా 12 బోర్ ఆయుధం ధరించి 1990 వరకు పనిచేశాడు. 1991లో డిప్యూటీ కమాండర్‌గా పదోన్నతిపై గడ్చిరోలి జిల్లా మాడ్ డివిజన్‌కు బదిలీపై వెళ్లాడు. అక్కడే పనిచేస్తున్న దళ సభ్యురాలు తలాండ కవితను 1992లో వివాహం చేసుకున్నాడు. 1994 వరకు పనిచేసిన అనంతరం వీరిరువురు బదిలీపై గోందీయా డివిజన్ ఉత్తర గడ్చిరోలీలో 1996 వరకు తాండదళంలో ఏరియా కమిటీ మెంబర్‌గా కొనసాగాడు. 2003 కమాండర్‌గా పదోన్నతి పొంది కోబ్రామడ్గా 2008 వరకు పనిచేశాడు. 2014లో కమాండర్ హోదాలో బదిలీపై ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ డివిజన్‌కు వెళ్లాడు. ప్రస్తుతం ఈయన స్థాయి తగ్గించి ఇంద్రావతి ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల వయసులోనే మావోయిస్టు దళంలో చేరిన ఈయన దాదాపు 30 ఏళ్లపాటు కొనసాగాడు. తలాండి కాంత ఊరఫ్ సుజాత. స్వస్థలం మహారాష్ట్రలోని ఆహెరి తాలుక దేశీల్పేట్ గ్రామం. మావోయిస్టు పార్టీలో డీసీఎంగా పనిచేస్తున్న ఆమె బంధువు సెడ్మేక రాధక్క ప్రోద్భలంతో 1991లో ఆహెరి దళంలో సభ్యురాలిగా చేరింది. 1992లో నుంచి 1994 వరకు బాంమ్రాగడ్ దళంలో.. 1994 నుంచి 2001 వరకు తాండ దళంలో పనిచేసింది. 2002 నుంచి 2004 వరకు దేవురిదళంలో ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేశారు. దేవురి దళంలో పదోన్నతి లభించి 2004 నుంచి 2008 వరకు దళ కమాండర్‌గా కొనసాగారు. 2009లో ఇంద్రావతి దళ కమాండర్‌గా బదిలీ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దళ కమాండర్‌గానే కొనసాగింది. జిల్లా సరిహద్దులో పోలీసుల గాలింపు ముమ్మరంగా కొనసాగుతుండడంతో ఇటీవల జిల్లాలోకి ప్రవేశించిన మావోయిస్టులకు తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన మా వోయిస్టులకు ప్రభుత్వం తరఫున అందాల్సిన పునరావాస సహాయం అందిస్తామని, లొంగిపోయిన వారికి రివార్డులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్, ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. -
పోలీసులకు ‘మాస్టర్ హెల్త్ చెకప్’
ఆదిలాబాద్ క్రైం : జిల్లా పోలీసుల ఆరోగ్య సంరక్షణపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ‘మాస్టర్ హెల్త్ చెకప్’ కార్యక్రమాన్ని ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ ప్రవేశపెట్టారు. జిల్లా కేంద్రంలోని సాకేత్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఎస్పీ ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. 40 సంవత్సరాలు నిండిన ప్రతీ పోలీసు కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో హెల్త్ చెకప్ నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం జిల్లాలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున అలాంటి సమస్యలు తలెత్తబోవని చెప్పారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వర్తిస్తారని తెలిపారు. అన్ని వైద్య పరీక్షలు ఆధునిక పరికరాలతో నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, సాకేత్ ఆస్పత్రి వైద్యుడు మనోహర్, ఏఆర్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, పోలీసు అసోసియేషన్ అధికార ప్రతినిధి తాజుద్దీన్, సీఐలు బుచ్చిరెడ్డి, రవీందర్, ప్రవీణ్‌రెడ్డి, ఎస్సైలు, వైద్యులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి కుంటాల : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తామని ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. కుంటాల పోలీస్‌స్టేషన్‌ను ఆయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో నేరాల అదుపునకు గ్రామగ్రామాన పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని, ఇందుకోసం జిల్లాలో త్వరలో 40 మంది మహిళా కానిస్టేబుళ్లతోపాటు మహిళా హోంగార్డులను నియమిస్తున్నట్లు చెప్పారు. ఆయా పోలీస్స్టేషన్లలో సిబ్బందికి క్వార్టర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. భైంసా డీఎస్పీ రావుల గిరిధర్, గ్రామీణ సీఐ ఎడ్ల మహేశ్, కుంటాల ఎస్సై ఎల్.రాజు, భైంసా రూరల్ ఎస్సై రవిప్రసాద్ పాల్గొన్నారు. -
త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు జరుగనున్నాయి. వివిధ ఠాణాల్లో దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు ఈ బదిలీల్లో స్థానభ్రంశం కలుగనుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ కసరత్తు ప్రారంభించారు. పోలీసు శాఖలో కౌన్సెలింగ్ విధానంలో బదిలీలకు ఆయన స్వీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీర్ఘకాలికంగా ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. పలువురికి స్థానభ్రంశం ఐదేళ్ల నుంచి ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు బదిలీ తప్పనిసరి. జిల్లావ్యాప్తంగా సుమారు 2,400 మంది కానిస్టేబుళ్లు సివిల్ డ్యూటీలో ఉన్నారు. గతేడాది ఐదేళ్లు నిండిన సుమారు 380 కానిస్టేబుళ్లను ఒక ఠాణా నుంచి మరో ఠాణాకు పంపించారు. ఈ బదిలీల్లో 250 మందికిపైగా బదిలీలు జరిగే అవకాశామున్నట్లు సమాచారం. జూన్ 2న కొత్త సర్కారు కొలువుదీరిన అనంతరం బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. బదిలీకి ఒక్కో విధానం గతంలో ఎస్పీలుగా పనిచేసిన వారు ఒక్కొక్కరు ఒక్కో విధానంలో బదిలీ ప్రక్రియ చేపట్టారు. కొన్ని సార్లు ఆ విధానాలు విమర్శలకు దారితీశాయి. గతంలో ఓ ఎస్పీ ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించి ఒక గ్రేడ్ నుంచి మరో గ్రేడ్‌కు, ఒక సబ్ డివిజన్ నుంచి మరో సబ్ డివిజన్‌కు తప్పనిసరి బదిలీ చేయాలని చేసిన ప్రయత్నాలపై పోలీసు శాఖలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ విధానాన్ని ఆయనకు వెనక్కు తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఎస్పీలు కూడా కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ఆప్షన్లకు అవకాశమిచ్చి వారికి అనువుగానే బదిలీలు చేపట్టారు. ప్రధానంగా కానిస్టేబుళ్లు తమ సొంత ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లలో పని చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తారు. రాత్రిపగలు అని తేడా లేకుండా పోలీస్ డ్యూటీలో ఉండే కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అనువైన చోటే అవకాశం ప్రస్తుత ఎస్పీ గజరావు భూపాల్ కౌన్సెలింగ్ విధానంలో ఈ బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో సర్కిల్, సబ్ డివిజన్, గ్రేడ్ అనే విధానాలు కాకుండా కానిస్టేబుల్ తనకు అనువుగా భావించే మూడు పోలీసు స్టేషన్లను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ ఎంచుకున్న స్టేషన్లలో ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడకు బదిలీ చేస్తారు. ఈ విధానంపై పోలీసు శాఖలో హార్షం వ్యక్తమవుతోంది. అదే విధంగా పైరవీలకు తావు లేకుండా అందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. తనకు కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలున్న పక్షంలో వారిని పట్టణ ప్రాంతాలు, ఆస్పత్రులు ఉన్నచోటికి బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌ను వివరణ కోరగా.. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లను వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తామని, త్వరలో బదిలీ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. -
‘పరిషత్’ ఎన్నికలపై పోలీసు నిఘా
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : రెండో విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు పోలీసు శాఖ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలపై నిఘా పటిష్టం చేసినట్లు గురువారం పోలీసు క్యాంపు కార్యాలయంలో ఎస్పీ గజరావు భూపాల్ వెల్లడించారు. రెండో విడతగా ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ డివిజన్లలో జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. పోలింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,131 పోలింగ్ కేంద్రాల్లో 94 అతి సమస్యాత్మక కేంద్రాలుగా, 194 కేంద్రాలు సమస్యాత్మకంగా, 34 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఎన్నికల్లో అలజడి సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగే ఎన్నికల కోసం ముగ్గురు అదనపు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 140 మంది ఎస్సైలు, 200 మంది ఏఎస్సైలు, 2,800 కానిస్టేబుళ్లు, 600 మంది సాయుధ దళాలు, 80 మంది మహిళా పోలీసులు, 600 మంది హోంగార్డులను ఏర్పాటు చేశారు. వీరితోపాటు 120 మంది ఎక్సైజ్, 100 మంది ఫారెస్టు, 40 మంది ఆర్టీ సిబ్బందిని నియమించారు. మొత్తం 4,800 మంది బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇక ‘స్థానిక’ భేరి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో తలమునకలైన అధికార యంత్రాంగం ఇక ‘స్థానిక’ సమరానికి కూడా కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కేవలం జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల వివరాలు ప్రకటించారు. 52 మండలాల పరిధిలో ఉన్న 636 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల ఎన్నికల నిర్వహణ కోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. సోమవారంలోగా ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశాలు అందడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున 52 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. అదేవిధంగా అన్ని మండలాల్లో కలిపి 636 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ షురూ చేయాలని ఫిబ్రవరి 24న జిల్లా పరిషత్ అధికారులకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలందాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆయా మండలాల ఎంపీడీవోలు పూర్తి చేశారు. ఇటీవల ఆర్డీవోల ద్వారా వీటిని కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. రిజర్వేషన్లపై కసరత్తు ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోల ఆధారంగా జిల్లా అధికారులు ‘స్థానిక’ రిజర్వేషన్లపై ఖరారు చేశారు. ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను పరిగణలోకి తీసుకున్నారు. 1995, 2001, 2006 ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి రిజర్వు అయిందో పరిశీలించి రొటేషన్ పద్ధతిలో ఖరారు చేశారు. మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ల విషయమై కమిషనరేట్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో ఖరారవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అధికారులతో కలెక్టర్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై కలెక్టర్ అహ్మద్‌బాబు శుక్రవారం పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ గజరావు భూపాల్, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, జెడ్పీ సీఈవో అనితగ్రేస్, డీఆర్వో ప్రసాదరావు తదితరులతో కలిసి ఎంపీడీవో, ఈఆర్వో, ఏఈఆర్వోలు, నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ అంశంపై సమీక్ష నిర్వహించారు. -
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రదామాల నివారణ అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ గజరావుభూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శనివారం ఆర్టీసీ రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించా రు. దీనికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాన్ని నడిపితే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ అనే నినాదాన్ని నిజం చేస్తూ ముందుకు సాగాలని డ్రైవర్లకు సూచించారు. ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ, వాహనదారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీటీఎం సరిరాం నాయక్, ఆదిలాబాద్ డిపో మేనేజర్ శివకేశవయాదవ్, అసిస్టెంట్ డిపో మేనేజర్ జాకుబ్, టీఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమేశ్, ఈయూ రీజినల్ కార్యదర్శి వెంకటయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకుడు రాంచందర్, రీజినల్ కార్యదర్శి సత్యనారాయణ, టీఎంయూ రీజినల్ కార్యదర్శి బిడి.చారి, నాయకులు ఉస్సేన్, యూసూఫ్, లింగయ్య పాల్గొన్నారు. రీజినల్ స్థాయిలో ఉత్తమ డ్రైవర్లు రీజినల్ స్థాయిలో ఉత్తమ డ్రైవర్లుగా నిలిచిన ముగ్గురుని అవార్డులు, నగదును అందజేశారు. ప్రథమ బహుమతి 29 ఏళ్ల 2 నెలల అనుభవంలో ప్రమాదాలు చేయని భైంసా డిపో డ్రైవర్ ఎండీ షఫీని సత్కరించి రూ.3,250ల నగదు అందజేశారు. నిర్మల్ డిపోకు చెందిన ఎస్కే జహీర్ అహ్మద్‌కు ద్వితీయ బహుమతిగా రూ.3,000, ఆసిఫాబాద్‌కు చెందిన ఈ.ప్రసాద్‌కు తృతీయ బహుమతిగా రూ.2,750 నగదు పంపిణీ చేశారు. డిపోల పరిధిలో ప్రథమ బహుమతిని అందుకున్న డ్రైవర్లకు రూ.2,000, ద్వితీయ బహుమతి రూ.1,750, తృతీయ బహుమతిగా రూ.1,500 నగదు అందజేశారు. డిపోల వారీగా ఉత్తమ డ్రైవర్లుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్న వారు వరుసగా... : ఆదిలాబాద్ : గణపతి, హిదియత్ అలీ, ఎండీఆరీఫొద్దీన్ ఆసిఫాబాద్ : ఎంకే గౌడ్, జి.దేవిదాస్, వి.శివరాం భైంసా : లతీఫ్, ముక్తార్, వైఎస్.ఖాన్ మంచిర్యాల : ఇక్బార్ హైమద్, అమీర్‌ఖాన్, జబ్బర్ నిర్మల్ : సర్వర్‌ఖాన్, వాజీబ్, రాజన్న ఉట్నూర్ : గంగారాం, కొమురయ్య, ఎస్.ఎం.రావు -
బదిలీల పర్వం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పోలీసుశాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పోలీసుశాఖ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మొదలైన బదిలీల పరంపర జిల్లాలో కొనసాగుతోంది. ఇటీవలే జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సర్వశ్రేష్ట త్రిపాఠి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ కాగా ఆయన స్థానంలో గజరావు భూపాల్ నియమితులయ్యారు. ఉట్నూరు, బెల్లంపల్లి ఏఎస్పీలు అంబర్కిశోర్ ఝా, భాస్కర్‌రావులు బదిలీ అయ్యారు. ఇదే క్రమంలో తాజాగా గురువారం బెల్లంపల్లి, నిర్మల్, భైంసా డీఎస్పీలు ఎం.రవీందర్‌రెడ్డి, వి.శేష్‌కుమార్, దేవీదాసులను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నలుగురు డీఎస్పీల నియామకం రాష్ట్రవ్యాప్తంగా 49 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా జిల్లాలో ముగ్గురికి స్థానచలనం కలిగింది. రెండేళ్లపాటు ఒకేచోట పనిచేస్తున్నారన్న కారణంతో వీరిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు కొత్తగా జిల్లాలో నలుగురు డీఎస్పీలను నియమించారు. బెల్లంపల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, నిర్మల్ డీఎస్పీ వి.శేష్కుమార్లను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేసిన ప్రభుత్వం, భైంసా డీఎస్పీ దేవీదాసు నాగులను వెకెన్సీ రిజర్వులో పెట్టారు. వీరి స్థానంలో వెయిటింగ్లో ఉన్న గ్రూపు-1 అధికారులను డీఎస్పీలుగా నియమించారు. భైంసా డీఎస్పీగా ఆర్.గిరిధర్, బెల్లంపల్లికి కె.ఈశ్వర్రావు, నిర్మల్‌కు ఎస్వీ మాధవరెడ్డిలను నియమించారు. అలాగే ఉట్నూరు ఏఎస్పీగా ఉన్న అంబర్కిశోర్ ఝా బదిలీ కాగా అప్పుడు ఎవరినీ నియమించకపోవడంతో సీహెచ్ చెన్నయ్యను డీఎస్పీగా నియమించారు. రెండు రోజుల్లో కొత్తగా నియమితులైన డీఎస్పీలు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. పోలీసుశాఖలో చర్చ రెండు మాసాల కిందటే పలువురు సీఐలు, ఎస్సైల బదిలీలు జరిగాయి. మరికొందరు అధికారులకు స్థానచలనం ఉండే అవకాశం ఉంది. కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన భూపాల్ పోలీసుశాఖపై పూర్తిగా పట్టు బిగిస్తున్నారు. ఈ క్రమంలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటే రెండేళ్లు పూర్తయిన పలువురు ఎస్సైలకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలిసింది. దీర్ఘకాలికంగా పనిచేసిన పలువురు సీఐలు బదిలీ కాగా రెండేళ్లు పూర్తయిన మందమర్రి, ఆసిఫాబాద్ సీఐలు రఘునందన్‌రావు, సత్యనారాయణతో మరో ఇద్దరు బదిలీ అయ్యే అవకాశాలపై పోలీసుశాఖలో చర్చ జరుగుతుండగా, ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ నాగయ్య ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. డీఎస్పీ పదోన్నతుల జాబితాలో ఉన్న బోథ్ సీఐ రాంగోపాల్‌కు కూడా స్థానచలనం తప్పదన్న చర్చ జరుగుతోంది. అలాగే సీఐల పదోన్నతుల జాబితాలో ఎనిమిది ఎస్సైలతోపాటు అవసరమైతే మరికొందరికి బదిలీ ఉండవచ్చంటున్నారు. -
27న బెల్లంపల్లిలో ఉద్యోగ మేళా
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 27న బెల్లంపల్లిలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని క్యాపస్టన్ సంస్థలో భద్రత సిబ్బంది పోస్టు కోసం ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంత యువకులు బెల్లంపల్లి హెడ్‌క్వార్టర్స్‌లో ఉదయం 8 గంటలకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన యువకులు 165 సెంటిమీటర్ల ఎత్తు, 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు, 50 కేజీల బరువు కలిగి ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మేడ్చల్‌లో నెల రోజులు శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం నెలకు రూ.7000 వేతనంతోపాటు, వసతి కల్పించన్నుట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రేషన్‌కార్డు, విద్యార్హత పత్రాల జిరాక్స్, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు వెంట తేవాలని సూచించారు. వివరాలకు పోలీసు కంట్రోల్ రూం నంబర్ 9440795079లో సంప్రదించాలని పేర్కొన్నారు. గతంలో పోలీసుస్టేషన్లలో దరఖాస్తు చేసుకున్న వారు సైతం హాజరుకావాలని సూచించారు. యువకులు ఉద్యోగంలో స్థిరపడేలా జిల్లా పోలీసులు, ఎస్సైలు, డీఎస్పీలు ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.