హైదరాబాద్ (వెంగళరావునగర్) : లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన హైదరాబాద్ అమీర్‌పేటలోని పావని ఫంక్షన్‌హాల్‌లో నిరుద్యోగులకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.సాంబిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్‌జీఎస్, ధర్మల్ సిర్టమ్స్, పాన్ బిజినెస్, సిజే కమ్యూనికేషన్స్, బలరామ్ ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయన్నారు. ఆయా కంపెనీల్లో దాదాపు 300 పోస్టులకు ఇంటర్యూలు జరుగుతాయని తెలియజేశారు. నిముషానికి 20 పదాలు ఇంగ్లీష్ టైప్ చేయగలవారు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బి.ఫార్మశీ, బీఈ, ఎంసీఏ, ఎంబీఏ, బీ.టెక్ చదివినవారు అర్హులన్నారు. జీతం నెలకు రూ.6,500 నుంచి రూ.25 వేలు వరకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 89770 31068, 88850 03334 నంబర్లలో సంప్రదించవచ్చని తెలియజేశారు.